By: ABP Desam | Updated at : 13 Dec 2021 12:57 PM (IST)
సీటెట్ అప్లికేషన్ కరెక్షన్కు లాస్ట్ ఛాన్స్
2021లో సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్‌కు సంబంధించిన మరో ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ సీటెట్‌ను నిర్వహిస్తోంది.
సంతకంలోకానీ, ఫొటోగ్రాఫ్‌లో కానీ ఇంకా అప్లికేషన్‌లో ఏమైన తప్పులుంటే సరిద్ది కోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తిచేయాలని బోర్డు సూచిస్తోంది. ఇప్పటికే సీటెట్ ఎగ్జామ్‌కు సంబంధించిన హాల్‌టికెట్స్ జారీ అయ్యాయి. అందుకే అప్లికేషన్‌లో ఎలాంటి తప్పుల్లేకుండా చూసుకోవాలని బోర్డు హితువు పలికింది.
సీటెట్ ఈ నెల 16న నిర్వహించనున్నారు. అప్లికేషన్‌లో తప్పులు సరిదిద్దుకునే అవకాశం డిసెంబర్11 నుంచి స్టార్ట్ అయింది. డిసెంబర్ 13 వరకు ఈ అవకాశం ఉంటుందని అప్పుడే చెప్పారు.
అప్లికేషన్ నింపేటప్పుడు జరిగిన తప్పిదాలను సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఫొటోలు అటాచ్ చేయడంలో జరిగిన తప్పిదాలను, సంతకం చేసేటప్పుడు చేసిన తప్పులను సరిచేసి డిసెంబర్13లోపు అప్‌లోడ్ చేయాలని చెప్పింది.
ఇప్పటికే హాల్‌టికెట్లను జారీ చేసింది. చాలా మందికి హాల్‌టికెట్లు రాలేదు. వివిధ కారణాలతో చాలా మంది అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. అందుకే సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చింది. సంతకాలు సరిగా పెట్టకపోయినా... ఫొటోలు అప్‌లోడ్ చేయకపోయినా చేసుకోమని చెబుతోంది.
ఈ సాయంత్రం లోపు సరిచేసిన అప్లికేషన్లు మళ్లీ అప్‌లోడ్ చేస్తే హాల్‌టికెట్లు జారీ చేస్తామని చెబుతోంది.
ఇప్పటికే ఒకసారి హాల్‌టికెట్స్ జారీ చేసిన బోర్డు ఇప్పుడు కరెక్షన్ చేసిన తర్వాత మళ్లీ హాల్‌టికెట్లు జారీ చేయనుంది. రెండు రోజుల ముందు హాల్‌టికెట్ జారీ చేయనున్న నేపథ్యంలో పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో కావాలని సూచిస్తోంది బోర్డు.
Also Read: Prime Membership Cost: నేడే ఆఖరి అవకాశం.. రేపు కొంటే ఏకంగా 50 శాతం పెంపు!
Also Read: Broadband Tariff Update: టెలికాం బాటలో బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు.. త్వరలోనే ఇంటర్నెట్ ధరల పెంపు?
Also Read: Interest Rate Cut: ఈ బ్యాంకు హోమ్ , కార్ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?
Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా పెరిగిన బంగారం.. స్థిరంగా ఉన్న వెండి, నేటి తాజా ధరలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
UGC NET 2022: యూజీసీ నెట్ షెడ్యూల్ విడుదల- ఏ సబ్జెక్ట్ పరీక్ష ఎప్పుడో తెలుసుకోండిలా
Caste Awareness Course: ఆ ఐఐటీలో ఇకపై క్యాస్ట్ అవేర్నెస్ కోర్స్ తప్పనిసరి! ఎప్పటి నుంచంటే?
CBSE 10th Result 2022: బీ అలర్ట్ - నేడు సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్ 2 ఫలితాలు విడుదల
Bill Gates Resume: బిల్‌గేట్స్ రెజ్యూమ్ చూశారా- ఆయన చేసిన కోర్సులు చూస్తే షాక్ అవుతారు
Paramedical Course after 10th: టెన్త్ తరవాత ఈ కోర్స్ చేస్తే, విదేశాల్లో కొలువు సంపాదించొచ్చు
Land Issues In Telangana: భూ సమస్యలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం - జూలై 15 నుంచి రెవెన్యూ సదస్సులకు ఆదేశం
YSRCP MP Phone Theft: వైసీపీ ఎంపీ సెల్ ఫోన్ చోరీ! ఓ యువతికి కష్టాలు, చివరికి ఏమైందంటే
Udaipur Murder Case: ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు - హైదరాబాద్‌లో మరో నిందితుడు అరెస్ట్
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !