అన్వేషించండి

TS LAWCET 2024 Results: తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే

TG LAWCET Results: తెలంగాణలో లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఫలితాలు జూన్ 13న విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ర్యాంకు కార్డులు పొందవచ్చు.

TG LAWCET Results Direct Link: తెలంగాణలోని లా కాలేజీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీలాసెట్‌, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫ‌లితాలు నేడు (జూన్ 13న) విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండ‌లి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ సాయంత్రం 4 గంటలకు ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టీజీలాసెట్/పీజీఎల్ సెట్ ర్యాంక్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి...

➥ లాసెట్ ర్యాంకు కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- lawcet.tsche.ac.in

➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Rank Card' అనే లింక్‌ మీద క్లిక్ చేయాలి.

➥ అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి. 

➥ వివరాలు నమోదుచేయగానే లాసెట్ ర్యాంక్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శనమిస్తుంది.

➥ అభ్యర్థులు ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.

లాసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

లాసెట్ ర్యాంకు కార్డు కోసం క్లిక్ చేయండి..

టీజీలాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ జూన్‌ 3న నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించింది. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు జరిగాయి. టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు తొలి రెండు సెషన్లు కలిపి మొత్తం 68 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 64 కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాలు ఉన్నాయి. ఇక మూడో సెషన్‌ పరీక్షలను మొత్తం 50 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 46 కేంద్రాలను, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం మొత్తం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది  పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో మొత్తం 79.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

అర్హత మార్కులు..
లాసెట్ 2024 ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు. అదేవిధంగా పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.

8 వేలకుపైగా సీట్లు అందుబాటులో..
ఈసారి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులతోపాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సులకు సంబంధించి 8 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కన్వీనర్‌ కోటా సీట్లు 7 వేల వరకు ఉన్నాయి. ఇందులో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి రాష్ట్రంలోని 22 కళాశాలల్లో 4,790 సీట్లు; ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి రాష్ట్రంలోని 19 కళాశాలల్లో 2,280 సీట్లు; రెండేళ్ల పీజీ లాడిగ్రీకి సంబంధించి రాష్ట్రంలోని 17 కళాశాలల్లో  మొత్తం 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Embed widget