అన్వేషించండి

TS EAMCET: ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్, సీట్లు పొందినవారు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇలా చేయండి!

TS EAMCET 2023: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్‌లో భాగంగా జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు జులై 22లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేయాలి.

TS EAMCET 2023: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్‌లో భాగంగా జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.  అలాట్‌మెంట్ జాబితాలో అభ్యర్థులు వారికి కేటాయించిన కళాశాల, కోర్సుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో జులై 22లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ ఆర్డర్‌ పొందిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్‌కు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. 

విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న ఫీజును క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించి, సీటు కేటాయింపును ధ్రువీకరించుకోవాలి. అయితే ట్యూష‌న్ ఫీజు చెల్లించే విద్యార్థులు.. వారి త‌ల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిది. ఎందుకంటే.. రీఫండ్ చేసేందుకు సుల‌భంగా ఉంటుంది. విద్యార్థులు జులై 22 లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫైన‌ల్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసిన త‌ర్వాత సంబంధిత కాలేజీల్లో విద్యార్థులు ఆగ‌స్టు 9 నుంచి 11వ తేదీ మ‌ధ్య‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

ఎంసెట్ ఇంజినీరింగ్ తొలిదశ సీట్ల కేటాయింపు తర్వాత రాష్ట్రంలోని 31 ఇంజినీరింగ్ కళాశాలల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండ‌గా, మొదటి దశలో 70,665 సీట్లు భ‌ర్తీ అయ్యాయి. ఇంకా 12,001 సీట్లు మిగిలిపోయాయి. సీట్ల కేటాయింపులో కంప్యూట‌ర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 94.20 శాతం సీట్లు భ‌ర్తీ కాగా, ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.70 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 44.09 శాతం, ఇత‌ర ఇంజినీరింగ్ కోర్సుల్లో 63.03 శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయి.

తొలి దశ కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 85.48 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందారు. వీటిలో మూడు యూనివ‌ర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయి. యూనివ‌ర్సిటీల్లో 85.12 శాతం, ప్రైవేటు యూనివ‌ర్సిటీల్లో 75.08 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 85.71 శాతం సీట్లు నిండాయి. మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండ‌గా, ఫ‌స్ట్ ఫేజ్‌లో 70,665 సీట్లు భ‌ర్తీ కాగా.. 12,001 సీట్లు మిగిలిపోయాయి. మిగిలిపోయిన సీట్ల భర్తీకి జులై 24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇక ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు. ఈ ఏడాది తెలంగాణలో అదనంగా 14,565 ఇంజినీరింగ్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.

Related Articles:

➥ ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి, ఎంతమంది సీట్లు పొందారంటే?

సివిల్, మెకానిక‌ల్ కోర్సులకు ఆదరణ కరవు- హాట్‌కేకుల్లా కంప్యూటర్ కోర్సులు!

ALSO READ:

టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల..
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2, 3 తేదీల్లో ఎంసెట్ బైపీసీ అభ్యర్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబరు 11న బీఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్ ఉండనుంది. సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget