EAMCET: ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి, ఎంతమంది సీట్లు పొందారంటే?
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి తొలివిడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70,665 మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ సీట్లు కేటాయించారు.
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి తొలివిడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70,665 మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ సీట్లు కేటాయించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చు. మొదటి విడత సీట్ల కేటాయింపుల తర్వాత 12,001 (14.52 శాతం) సీట్లు భర్తీ కాకుండా మిగిలాయి. సీటు పొందిన విద్యార్థులు జులై 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు.
సీట్ల కేటాయింపు ఫలితాల కోసం క్లిక్ చేయండి..
కోర్సుల వారీగా తొలి విడతలో సీఎస్ఈలో 94.20 శాతం, ఈఈఈలో 58.38, సివిల్‌లో 44.76, మెకానికల్‌లో 38.50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అలాట్‌మెంట్ జాబితాలో అభ్యర్థులు వారికి కేటాయించిన కళాశాల, కోర్సుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. విద్యార్థులు ఈ ఆర్డర్ పొందిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్‌కు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి చేపట్టిన ఎంసెట్-2023 వెబ్ ఆప్షన్ల గడువు జులై 12తో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 75,172 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరి నుంచి మొత్తం 49,42,005 ఆప్షన్లు నమోదయ్యాయి. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా 1,109 ఆప్షన్లు నమోదు చేసినట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ తెలిపారు. అభ్యర్థులకు జులై 16న సీట్లు కేటాయించనున్నారు.
అదేవిధంగా జులై 21 నుంచి ప్రారంభంకావాల్సిన రెండోవిడత కౌన్సెలింగ్ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇక ఆగస్టు 2 నుంచి ప్రారంభంకావాల్సిన తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి మొదలుకానుంది. తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతించిన సంగతి తెలిసిందే. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి.
రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ జులై 24 – జులై 25: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
➥ జులై 23: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్.
➥ జులై 24 – జులై 27: సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
➥ జులై 27: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
➥ జులై 31: సీట్ల కేటాయింపు.
➥ జులై 31 – ఆగస్టు 2 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ ఆగస్టు 8: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
➥ ఆగస్టు 5: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్.
➥ ఆగస్టు 4 - ఆగస్టు 6 వరకు: సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
➥ ఆగస్టు 6: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
➥ ఆగస్టు 9: సీట్ల కేటాయింపు.
➥ ఆగస్టు 9 – ఆగస్టు 11: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
స్పాట్ ప్రవేశాలు...
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 10 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల..
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2, 3 తేదీల్లో ఎంసెట్ బైపీసీ అభ్యర్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబరు 11న బీఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్ ఉండనుంది. సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial