అన్వేషించండి

Engineering Seats: సివిల్, మెకానిక‌ల్ కోర్సులకు ఆదరణ కరవు- హాట్‌కేకుల్లా కంప్యూటర్ కోర్సులు!

తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్‌లో భాగంగా జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లకుగాను తొలి దశలో 70,665 సీట్లు భ‌ర్తీ అయ్యాయి.

తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్‌లో భాగంగా జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండ‌గా, మొదటి దశలో 70,665 సీట్లు భ‌ర్తీ అయ్యాయి. ఇంకా 12,001 సీట్లు మిగిలి ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇక ఈ ఏడాది కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్ల‌న్నీ నిండిపోయాయి. ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు పెద్ద ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. కంప్యూట‌ర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 94.20 శాతం సీట్లు భ‌ర్తీ కాగా, ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.70 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 44.09 శాతం, ఇత‌ర ఇంజినీరింగ్ కోర్సుల్లో 63.03 శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయి.

కంప్యూట‌ర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల‌ను ప‌రిశీలిస్తే..
ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, కంప్యూట‌ర్ ఇంజినీరింగ్, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టం, సీఎస్ఈ(ఐవోటీ అండ్ సైబ‌ర్ సెక్యూరిటీ ఇన్‌క్లూడింగ్, బ్లాక్ చైన్ టెక్నాల‌జీ)లో, కంప్యూట‌ర్ సైన్స్, ఇంజినీరింగ్ నెట్‌వ‌ర్క్స్, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో 100 శాతం సీట్లు నిండిపోయాయి. కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌(సీఎస్ఈ)లో 98.70 శాతం సీట్లు నిండిన‌ట్లు ఎంసెట్ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు.

ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్ కోర్సులకు పరిశీలిస్తే..
బ‌యో మెడిక‌ల్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్స్ క‌మ్యూనికేష‌న్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌(ఈసీఐ), ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిమెటిక్స్‌(ఈటీఎం) కోర్సుల్లో 100 శాతం సీట్లు భ‌ర్తీ కాగా, ఎల‌క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌(ఈసీఈ)లో 87.10 శాతం సీట్లు నిండాయి. ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్ ఇంజినీరింగ్(ఈఈఈ)లో కేవ‌లం 58.38 శాతం సీట్లు మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయి.

సివిల్, మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు పరిశీలిస్తే..
మెట‌లార్జిక‌ల్ ఇంజినీరింగ్(ఎంఈటీ), బీటెక్ మెకానిక‌ల్ విత్ ఎంటెక్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ సిస్ట‌మ్స్‌(ఎంఎంఎస్), బీటెక్ మెకానిక‌ల్ విత్ ఎంటెక్ థ‌ర్మ‌ల్ ఇంజినీరింగ్(ఎంటీఈ), ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్, మెకానిక‌ల్(మెక్‌ట్రోనిక్స్) ఇంజినీరింగ్‌(ఎంసీటీ), ఆటో మొబైల్ ఇంజినీరింగ్‌లో 100 శాతం సీట్లు, సివిల్ ఇంజినీరింగ్‌లో 44.76 శాతం సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్(ఎంఈసీ)లో 38.50 శాతం సీట్లు మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయి.

ఇక కెమిక‌ల్ ఇంజినీరింగ్‌ విషయానికొస్తే.. మొత్తం 98.65 శాతం, జియో ఇన్ఫ‌ర్మెటిక్స్‌లో 95.38 శాతం, అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌లో 93.94 శాతం సీట్లు నిండాయి. ఇండ‌స్ట్రీయ‌ల్ ప్రొడ‌క్షన్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలి క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఒక్క సీటు కూడా భ‌ర్తీ కాలేదు.

సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల..
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2, 3 తేదీల్లో ఎంసెట్ బైపీసీ అభ్యర్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబరు 11న బీఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్ ఉండనుంది. సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Embed widget