By: ABP Desam | Updated at : 06 Feb 2023 04:04 PM (IST)
Edited By: omeprakash
తెలంగాణలో కొత్త కోర్టులు
తెలంగాణ రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు సత్వర న్యాయం అందించడం కోసం.. జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలోనే నూతనంగా ఏర్పడిన 23 జిల్లాల్లో జిల్లా కోర్టులను, న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కోర్టుల నిర్వహణ కోసం 1,721 పోస్టులను కొత్తగా మంజూరు చేశామన్నారు. రూ.1050 కోట్ల అంచనా వ్యయంతో కొత్త కోర్టుల భవనాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
హోంశాఖకు రూ. 9,599 కోట్లు కేటాయింపు..
తెలంగాణ పోలీసింగ్ ఇతర రాష్ట్రాల పోలీసులకు రోల్ మోడల్‌గా మారిదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో హోంశాఖకు రూ. 9,599 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొత్తగా 31,198 పోలీసు ఉద్యోగాల కల్పన చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక అవార్డులు అందుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ భవనాన్ని గతేడాది ఆగస్టు 4న సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు నిఘాతో పాటు, అత్యవసర పరిస్థితులు, ఇతర విపత్కర సందర్భాల్లో వివిధ శాఖలను అనుసంధానం చేశామన్నారు. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9.8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందన్నారు. శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రతల నిర్వహణ ఒక కారణమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ : మంత్రి హరీష్‌రావు
తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలిపారు. సంక్షేమానికి అభివృద్ధి రెండు జొడేద్దులుగా సమపాళ్లలో బడ్జెట్ కూర్పు ఉండబోతోందన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతుంటే... ఒక్క రూపాయి కూడా రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తోందన్నారు హరీష్‌రావు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోందని అభిప్రాయపడ్డారు. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచిందన్నారు. సభలో నేను, మండలి లో ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెడుతారన్నారు. బడ్జెట్ నిన్న కేబినేట్ ఆమోదంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించిందన్నారు.
Also Read:
తెలంగాణ బడ్జెట్: శాఖలు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఇవీ, దీనికి అత్యధికంగా నిధులు
తెలంగాణ బడ్జెట్ 2023 - 24 ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో భారీ బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.37,525 కోట్లు. ఇందులో వివిధ శాఖలకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి.
బడ్జెట్ వివరాల కోసం క్లిక్ చేయండి..
బడ్జెట్‌లో రైతులకు బిగ్ గుడ్‌న్యూస్! భారీగా నిధులు - రుణమాఫీకి కూడా
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అందుకే బడ్జెట్‌లో స్పెషల్ ఫోకస్ పెట్టింది. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకంగా తెలంగాణ నిలుస్తోందని భావిస్తున్న ప్రభుత్వం మరింత జాగ్రత్తగా బడ్జెట్ కేటాయింపులు చేసింది. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాట్లాడిన హరీష్‌రావు.. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానలు తమ రాష్ట్రంలో అమలు చేయాలని చాలా రాష్ట్రాల రైతులు ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
JEE Advanced 2023: జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
Sainik School Admissions: సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!