Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్: శాఖలు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఇవీ, దీనికి అత్యధికంగా నిధులు
రూ.2,90,396 కోట్లతో భారీ బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.37,525 కోట్లు.
తెలంగాణ బడ్జెట్ 2023 - 24 ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో భారీ బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.37,525 కోట్లు. ఇందులో వివిధ శాఖలకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి.
శాఖల వారీగా కేటాయింపులు ఇవే
పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్ శాఖ - 31,426 కోట్లు
సాగునీటిపారుదల శాఖ - రూ.26,885 కోట్లు
విద్యుత్ శాఖ - 12,727 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ- 3,117 కోట్లు
మహిళా శిశు సంక్షేమం - 2, 131 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖ- 2,200 కోట్లు
అటవీ శాఖ, హరిత హారానికి - 1,471 కోట్లు
విద్యాశాఖ - 19,093 కోట్లు
వైద్య ఆరోగ్య రంగానికి- 12,161 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ -31,426 కోట్లు
పురపాలక శాఖ - 11,372కోట్లు
పరిశ్రమల శాఖ - 4,037 కోట్లు
హోం శాఖకు - 9, 599 కోట్లు
పరిశ్రమల శాఖ - రూ.4,037 కోట్లు
పథకాలకు కేటాయింపులు ఇవే
రైతు రుణ మాఫీ - 6,385 కోట్లు
ఆసరా పింఛన్లకు - 12,000 కోట్లు
దళిత బంధు-17,700కోట్లు
ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి-36,750 కోట్లు
ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధి- 15, 233 కోట్లు
షాదీ ముబారక్/ కల్యాణలక్ష్మి- 3,210 కోట్లు
మైనారిటీ కార్పొరేషన్ రుణాల కోసం- 270 కోట్లు
కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్- 200 కోట్లు
హోం శాఖ - రూ.9,599 కోట్లు
వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు కేటాయింపులు
మెట్రో రైలు ప్రాజెక్టు కోసం మొత్తం - రూ.1,500 కోట్లు
వీటిలో ఓల్డ్ సిటీలో మెట్రో అనుసంధానం కోసం - రూ.500 కోట్లు
ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ కోసం - రూ.500 కోట్లు
ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి - రూ.1,500 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి - రూ.200 కోట్లు