Telangana Budget 2023 Live Updates: 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ 2023-24
Telangana Budget 2023 Live Updates: తెలంగాణ బడ్జెట్‌కు సంబంధించిన వివరాల కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.
LIVE
Background
Telangana Budget 2023 Live Updates: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఈ విడతకు సంబంధించిన తన ఆఖరి బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల కోట్లతో ఈ పద్దును రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెడతారు. బడ్జెట్‌ను ఆదివారం సమావేశమైన క్యాబినెట్ ఆమోదించింది. సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది.
మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. అందుకే ఈసారి ప్రవేశ పెట్టే బడ్జెట్ వాటిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్లకు పైగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. రుణ మాఫీకి కూడా భారీగా నిధులు ఇస్తున్నట్టు సమాచారం.
కేంద్రం పన్నుల వాటా తగ్గిపోతున్న వేళ సొంతంగా నిధులు వేటను సాగిస్తోంది ప్రభుత్వం. భూముల అమ్మకాలు, పన్నుల పెంపు ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల్లో తెలంగాణ వాటా 2.10 శాతం. ఈ ప్రకారం రూ.21,470 కోట్లు తెలంగాణకు వస్తాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు.. ఇతర గ్రాంట్స్ కూడా కలిపి రాష్ట్రానికి రూ.38 వేల కోట్లు మాత్రమే అందనున్నాయి. అప్పుల పరిమితిపై కూడా కేంద్రం నియంత్రణ విధించనుంది. ఈ ఏడాది కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులను కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిబంధనల ప్రకారం రావాల్సిన అప్పులను కూడా నియంత్రించడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే.. బడ్జెట్‌లో ఎంత మేర అప్పులను లక్ష్యంగా పెట్టుకున్నా.. వాటి లక్ష్యం మేర బహిరంగ మార్కెట్ రుణాలను సాధించుకోవడం అంత తేలిక కాదు.
స్వల్పంగా వివిధ రకాల పన్నుల పెంపు ఉండే చాన్స్ !
భూముల అమ్మకంపై ఎక్కువ ఆశలు !
హైదరాబాద్ శివార్లలో భూములను వేలం వేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకుంది. ఈ సారి జిల్లాల్లో కూడా భూములు వేలం వేయాలన్న ఆలోచన చేస్తోంది. నిరుపయోగ భూములు 32 జిల్లాల్లో గుర్తిం చిన వివరాల సేకరణ, అమ్మకం, రాజీవ్ స్వగృహ ఇండ్లు, కార్పొ రేషన్ పరిధిలోని భూముల అమ్మకం, దిల్‌కు సంబంధించిన భూములపై ఉన్న కేసును పరిష్కరించుకుని వీటి విక్రయాలు నిర్వహించి ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలిసింది. అదేవిధంగా పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలు, వన్‌టైం సెటిల్‌మెంట్లకు ఉన్న అవకాశాలు, కేంద్రం వద్ద ఉన్న బకాయిలను వసూలు చేసుకునే అవకాశాలతో బడ్జెట్‌లో అంచనాలను ప్రతిపాదించనున్నట్లుగా తెలుస్తోంది.
కేంద్రం తీరుతో తెలంగాణకు తీరని అన్యాయం: హరీష్‌రావు
కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఆంక్షలు పెట్టిందన్నారు. ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణకు 2019-20 సంవత్సరంలో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా 723 కోట్లు స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని 15వ ఆర్థిక సంగం చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిందన్నారు. 2021-26 సంవత్సరాలకు 5,374 కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని సిఫార్సు చేసినా... ఇవ్వకుండా అన్యాయం చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సిన పన్నుల రాయితీలు, వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టే ప్రత్యేక చర్యలు ఇంత వరకు తీసుకోకుండా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు. ఏడాదికి 450 కోట్లు చొప్పున తలంగాణకు ఇవ్వాలిసి ఉండగా మూడు సంవత్సరాలకు సంబంధించి 13,50 కోట్లు ఇవ్వనేలేదన్నారు.
మిషన్ భగీరథకు 19,205కోట్లు, మిషన్ కాకతీయ పథకానికి ఐదువేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా పట్టించుకోలేదన్నారు.
రాష్ట్రంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్శిటీని స్థాపించాలని చట్టంలో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా వెనక్కి తీసుకున్నారని విమర్శించారు.
కృష్ణాజలాల వాటాను నిర్ణయించాలని బ్రజేష్ కుమార్ ట్రైబ్యులనల్‌కు కేంద్రం సూచించవలసి ఉంది కానీ ఇంతవ రకు ఆ దిశగానే చర్యలు తీసుకోలేదన్నారు. దీని వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, డిండీ వంటి ప్రాజెక్టులకు అంతరాయం కలుగుతుందన్నారు.
తలసరి ఆదాయంలో భేష్: హరీష్‌రావు
తెలంగాణలో 2013-14 సంవత్సరం 1,12, 162 రూపాయలు ఉన్న తలసరి ఆదాయం... 2022-23లో 3, 17, 115 రూపాయలకు చేరింది. ఇది జాతీయ సగటు ఇయిన 1,70, 620 రూపాయల కంటే 86 శాతం ఎక్కువ అని తెలిపారు. జాతీయ ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం 1,46, 495 రూపాయలు ఎక్కువగా ఉందన్నారు.
తెలంగాణపై ఆర్థిక మాంధ్యం ప్రభావం లేదు: హరీష్‌రావు
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రధాన రంగాల్లో, ఉపరంగాల్లో గణనీయమైన వృద్ధి సాదించందన్నారు హరీష్‌రావు. ప్రథమ, ద్వితీయ, తృతీయరంగాల్లో అధిక వృద్ధి రేటు నమోదు సాధించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంధ్యం ఏర్పడినా, దాని ప్రభావం తెలంగాణపై అంతగా లేదన్నారు. రాష్ట్రంలో వినియోగంతోపాటు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా మారుతోంది: హరీష్‌రావు
ఈ అభివృద్ధి మోడల్ గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ మోడల్ దేశంలోని చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కితాబు ఇచ్చారు. 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 13.2 శాతం పెరిగిందని గుర్తు చేసారు. అదే టైంలో దేశ జీడీపీ వృద్ధి రేటు కేవలం 10.2 శాతం తగ్గిందని వివరించారు.
2017-18 నుంచి 2021-22 మధ్య తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు సాధించని తెలిపారు హరీష్‌రావు. 11. 8 శాతంతో దక్షిణాది రాష్ట్రాల్లోనే టాప్‌లో ఉందని పేర్కొన్నారు. ఇది ఇప్పటి వరకు రికార్డు విజయమన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొందన్నారు.
దేశ జీడీపీలో చూసుకుంటే దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగైన ఫలితాలను సాధించందని తెలిపారు. 2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతం జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధిరేటుతో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు.
దేశంలో వృద్ధి రేటులో తెలంగాణ టాప్
దేశంలోని ఇతర్రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు మంత్రి హరీష్‌రావు. బడ్జెట్ 2023-24 సభలో ప్రవేశ పెట్టిన ఆయన.. తెలంగాణ అభివృద్ధిని సభకు వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జీఎస్డీపీ వార్షిక వృద్ధి రేటు 12 శాతం మాత్రమే ఉండేదన్నారు. ఇది జాతీ వృద్ధి రేటు 13.4 శాతం కంటే తక్కువగా ఉండేదన్నారు. పతనమైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకే క్రమంగా జీఎస్డీపీ పెరుగుతూ వ్చచిందని వివరించారు. ప్రభుత్వ ఆదాయాన్ని ఆత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం... అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇవ్వడంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు.
ఈ అభివృద్ధి మోడల్ గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జ రుగుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ మోడల్ దేశంలోని చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కితాబు ఇచ్చారు. 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 13.2 శాతం పెరిగిందని గుర్తు చేసారు. అదే టైంలో దేశ జీడీపీ వృద్ధి రేటు కేవలం 10.2 శాతం తగ్గిందని వివరించారు.