Tanuku SI Suicide: సీఎం బందోబస్తుకు వెళ్లాల్సిన ఎస్ఐ ఆత్మహత్య, పీఎస్‌లోనే తుపాకీతో కాల్చుకుని సూసైడ్
SI Suicide in Tanuku | పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో విషాదం చోటుచేసుకుంది. రూరల్ పీఎస్ లో ఎస్ఐ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

SI Dies by Suicide Using Gun at Police Station | తణుకు: తుపాకీతో కాల్చుకొని ఓ ఎస్ఐ మృతిచెందాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 31న ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన తుపాకీతో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సై ఏజీఎస్ మూర్తి ఇటీవల ఆరోపణలు రావడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు.
ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఎస్ఐ మూర్తి సీఎం చంద్రబాబు పర్యటన బందోబస్తుకు వెళ్లే క్రమంలో ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. కొంత సమయం తరువాత బాత్రూమ్ లోకి వెళ్లిన ఎస్ఐ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం తోటి పోలీస్ సిబ్బంది 108 వాహనంలో ఎస్ఐ మూర్తి మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. గేదెల అపహరణ కేసులో ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారని తెలిసిందే.
నేడు పెనుగొండలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.00 గంటలకు పెనుగొండలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆలయంలో అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం తిరిగి అమరావతికి వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

