KalvaKuntla Kavitha politics: బీసీ రిజర్వేషన్లు, ప్రాజెక్టులపై పోరాటాలు - బీఆర్ఎస్‌కు పోటీగా కవిత జాగృతి రాజకీయాలు ?
BRS: తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి రాజకీయ కార్యకలపాల వేదికగా మారుస్తున్నారు కవిత. తాజాగా ప్రాజెక్టులపై చర్చా కార్యక్రమాన్ని ప్రకటించారు.

Kavitha is expanding Telangana Jagrthi activities: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులపై శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటలకు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. "నీళ్లు-నిజాలు" పేరిట జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. సమావేశానికి మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు హాజరు కానున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఇప్పటికే జాగృతి తరపున పోరాటం చేస్తున్న కవిత ఇప్పుడు ప్రాజెక్టుల అంశాన్ని అందుకోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కవిత మెల్లగా బీఆర్ఎస్‌కు పోటీగా రాజకీయ ఉద్యమాలు ఉద్ధృతం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రారంభించిన జాగృతి
తెలంగాణ ఉద్యమంల సమయంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమైక్య రాష్ట్రంలో వెనుకబడిపోయిన తెలంగాణకు చెందిన సంస్కృతుల్ని ప్రజల్లోకి మళ్లీ తీసుకెళ్లేందుకు జాగృతిని ఏర్పాటు చేశారు. బతుకమ్మ సహా పలు కార్యక్రమాలను విరివిగా నిర్వహించి.. మహిళల్ని ఉద్యమంలోకి వచ్చేలా చేయగలిగారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తెలంగాణ జాగృతికి బతుకమ్మ ఉత్సవాలకు నిధులు కూడా కేటాయించింది. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత తన తెలంగాణ జాగృతిని కూడా కవిత భారత జాగృతిగా మార్చారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని చేశారు. జైలుకెళ్లిన తర్వాత.. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత జాగృతి సైలెంట్ అయిపోయింది.
ఇప్పుడు పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకే జాగృతి ప్రయత్నం
కవిత తీహార్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ రాజకీయ పోరాటం ప్రారంభించారు. అదానీ పై అమెరికాలో కేసు నమోదయిందని వెలుగులోకి వచ్చినప్పుడు మోదీపై విమర్శలుచేస్తూ ట్వీట్లు చేశారు. అప్పట్నుంచి యాక్టివ్ అయ్యారు. తరవాత జాతీయ అంశాల కన్నా రాష్ట్ర అంశాలనే తీసుకుని పోరాటం చేస్తున్నారు. ముందుగా బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని డిక్లరేషన్ ప్రకటించింది . ఆ మేరకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని ఆమె పోరాటం చేశారు. మేధావులతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ను రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ప్రాజెక్టుల అంశం టేకప్
కవిత తాజాగా ప్రాజెక్టుల అంశాన్ని జాగృతి తరపున తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలని అనుకుంటోంది. బీఆర్ఎస్ ఈ అంశంపై విమర్శుల చేస్తోంది. రేవంత్ రెడ్డి స్పందించడం లేదని అంటోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కన్నా ముందుగా జాగృతి తరపున నీళ్లపై చర్చా వేదికలతో పోరాటం ప్రారంభించారు. ముందు ముందు మరింత ఎక్కువగా ఈ అంశంపై ఫోకస్ చేసే అవకాశం ఉంది.
కవిత ఏదైనా భారత రాష్ట్ర సమితి తరపున చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆమె ఏ కార్యక్రమం చేపట్టిన జాగృతి తరపునే చేస్తున్నారు. స్పెస్ లేకపోయినా తనకు తాను సృష్టించుకుని పోరాటం చేస్తున్నారని అంటున్నారు. ఈ అంశమే బీఆర్ఎస్‌లోనూ ఆసక్తికరంగా మారుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

