అన్వేషించండి

TS SSC Results: ఉదయం 11 గంటలకు తెలంగాణ పదోతరగతి ఫలితాల వెల్లడి, ఇలా చెక్‌ చేసుకోండి

TS 10th Results: తెలంగాణలో పదోతరగతి పరీక్షల ఫలితాలను ఇవాళ(ఏప్రిల్ 30న) విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 29న అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Telangana SSC Results 2024: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను నేడు(ఏప్రిల్ 30న) విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎస్సెస్సీ ఫలితాలు ఇవాళ విడుదల చేయబోతున్నట్టు ఏప్రిల్ 29న అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని SCERT కాంప్లెక్స్, గోదావరి ఆడిటోరియలో (ఎల్బీ స్డేడియం ఎదురుగా ఉన్న) విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా 2,676 ప‌రీక్షా కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 5,08,385 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది; బాలికలు 2,50,433 మంది ఉన్నారు. ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ తోపాటు https://telugu.abplive.com/ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.

http://results.bse.telangana.gov.in/

http://results.bsetelangana.org/ 

TS SSC Results: ఉదయం 11 గంటలకు తెలంగాణ పదోతరగతి ఫలితాల వెల్లడి, ఇలా చెక్‌ చేసుకోండి

రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియను అధికారులు చేపట్టారు.  టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 20తో ముగిసింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫలితాలను డీకోడింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులుకాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు. గతేడాది తెలంగాణ‌లో ఏప్రిల్ 3 ఏప్రిల్ 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను మే 10న విడుద‌ల చేశారు. అయితే ఈ సారి లోక్ స‌భ ఎన్నిక‌ల నేపథ్యంలో..  మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించారు. గతేడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 27 వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. 

తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇలా చూసుకోండి..

➥  పదోతరగతి ఫలితాల కోసం విద్యార్థులు మొదట BSE Telangana అధికారిక సైట్‌ని సందర్శించాలి-https://bse.telangana.gov.in/

➥ అక్కడ హోమ్‌పేజీలో కనిపించే 'TS SSC Results 2024' లింక్‌పై క్లిక్ చేయాలి.

➥ క్లిక్ చేయగానే వచ్చే పేజీలో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదు చేసి, 'Submit' బటన్ మీద క్లిక్ చేయాలి.

➥ విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 

➥ ఆ తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. వారంరోజుల్లో ఫలితాల వెల్లడికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి వారంలో పరీక్షల ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే ఫలితాల వెల్లడి కచ్చితమైన తేదీని, సమయాన్ని మాత్రం సీబీఎస్‌ఈ అధికారికంగా ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదోతరగతి పరీక్షలు; ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు 12వ తరగతి పరీక్షలును సీబీఎస్ఈ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 38 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో పదోతరగతి పరీక్షలకు 22 లక్షలకుపైగా, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 16 లక్షల మంది  విద్యార్థులు హాజరయ్యారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget