News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

JEE Main Admit Card: జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 అడ్మిట్ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

జేఈఈ మెయిన్-2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మార్చి 6 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 3న సాయంత్రం విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మార్చి 6 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం (ఏప్రిల్ 3న) సాయంత్రం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్లలో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. 

దేశవ్యాప్తంగా 330 సిటీల్లో ఏప్రిల్ 6,8,10,11,12,13, 15 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అలాగే, విదేశాల్లోని 15 నగరాల్లోనూ ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు మొత్తం 9.4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్(సెషన్-2) అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఎదురైతే విద్యార్థులు హెల్ప్‌లైన్ నంబర్- 011-40759000 లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. మరోవైపు, జేఈఈ మెయిన్‌లో టాప్‌స్కోరు సాధించే 2,50,000 మంది విద్యార్థులు జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

www.nta.ac.in

https://jeemain.nta.nic.in

పరీక్ష విధానం:

➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 

➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

➥ బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

JEE (Main) - 2023 Notification

Eligibility Criteria

Official Website 

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) మెయిన్‌– 2023  ఫస్ట్ సెషన్‌ పేపర్‌–1 ఫలితాలు ఫిబ్రవరి 6న విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వారిలో పేపర్‌–1(బీఈ, బీటెక్‌) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్‌–2(బీఆర్క్, బీప్లానింగ్‌) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారు. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరవడం ఇదే తొలిసారి. 

Also Read:

SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!
తెలంగాణ‌లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఏప్రిల్ 10న సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 03 Apr 2023 09:45 PM (IST) Tags: JEE Main Admit Card jee main 2023 admit card jee admit card jee main session 2 2023 jee main 2 admit card 2023 jee main session 2 admit card 2023

ఇవి కూడా చూడండి

Telangana Group 1 :    గ్రూప్ 1 ప్రిలిమ్స్  రద్దు ఖాయం   - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

NIMS: 'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

NIMS: 'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్

Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్

ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !

ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !

Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !

Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !