News
News
వీడియోలు ఆటలు
X

Sainik School Admissions: సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?

హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకి దరఖాస్తులు కోరుతోంది.

FOLLOW US: 
Share:

ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 8 లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఏప్రిల్ 30న ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనంతో పాటు దుస్తులు, పుస్తకాలు తదితరాలు అందిస్తారు.

వివరాలు..

* సైనిక పాఠశాల (ఎస్టీ) - ఆరో తరగతి ఇంటర్ ప్రవేశాలు
 
అర్హతలు: ఆరో తరగతికి 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి పరీక్షకు హాజరైన/ ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. ఇంటర్‌కు 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతరగతి పరీక్షకు హాజరైన/ ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. తెలుగు/ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అర్హులు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

సీట్ల సంఖ్య: ఆరో తరగతి- 80 సీట్లు, ఇంటర్- 80 సీట్లు.

వయో పరిమితి (31.03.2023 నాటికి ):

* ఇంటర్‌కు 01.04.2006 - 31.06.2008 మధ్య జన్మించి ఉండాలి. 

* ఆరో తరగతికి 01.04.2011 - 31.03.2013 మధ్య జన్మించి ఉండాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.

రాతపరీక్ష విధానం: ఆరోతరగతి రాత పరీక్ష అయిదో తరగతి స్థాయిలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 100 ఉంటాయి. తెలుగు(20 మార్కులు), ఇంగ్లిష్(30 మార్కులు), మ్యాథ్స్(30 మార్కులు), సైన్స్(10 మార్కులు), సోషల్ స్టడీస్(10 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్ రాత పరీక్ష 8-10వ తరగతి స్థాయిలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 100 ఉంటాయి. ఇంగ్లిష్(20 మార్కులు), మ్యాథ్స్(40 మార్కులు), ఫిజిక్స్(20 మార్కులు), కెమిస్ట్రీ(15 మార్కులు), బయాలజీ(5 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 08.04.2023.

*  హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 23.04.2023 నుంచి.

*  ప్రవేశ పరీక్ష తేదీ: 30.04.2023.

*  ప్రవేశ పరీక్ష ఫలితాలు: 05.05.2023.

* ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష తేదీలు: 08.05.2023 నుంచి 13.05.2023 వరకు.

* సైనిక పాఠశాలలో ప్రవేశాల తేదీ: 12.06.2023.

Notification

Online Application

Website

ALso Read:

'టెన్త్' విద్యార్థులకు గుడ్ న్యూస్, కొత్త మోడల్ పేపర్లు వచ్చేశాయ్! ఇక 'ఛాయిస్' మీదే!
తెలంగాణలో పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త మోడల్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయి. టెన్త్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో మార్పులకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులతో కొత్త మోడల్‌ పేపర్లను విడుదల చేసింది. ఎన్‌సీఈఆ‌ర్‌టీ అధికారిక వెబ్‌సైట్‌లో మోడల్ పేపర్లను అందుబాటులో ఉంచింది. త్వరలోనే పాఠశాలలకు కొత్త మోడల్ పేపర్లు, బ్లూప్రింట్‌ను ప్రభుత్వం సరఫరా చేయనుంది.
పదోతరగతి మాదిరి ప్రశ్నపత్రాల కోసం క్లిక్ చేయండి..

ఐఐఎస్సీలో బీఎస్సీ(రీసెర్చ్) ప్రవేశాలకు నోటిఫికేషన్
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్సీ) నాలుగేళ్ల సైన్స్ రిసెర్చ్ డిగ్రీ (బీఎస్సీ-రిసెర్చ్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ పూర్తిచేసినవారు, ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరవుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ విద్యాసంస్థలో నాలుగేళ్ల బీఎస్సీ రిసెర్చ్ కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రపంచస్థాయిలో పేరున్న సంస్థల్లో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఐఐఎస్సీలోనే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎమ్మెస్సీ డిగ్రీ పొందవచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ దిశగా అడుగులు వేయవచ్చు.
దరఖాస్తు, కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ-2023)‌ నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పరీక్ష షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నారు. సీయూటీ పీజీ ప్రవేశ పరీక్షను  జూన్ 1 నుండి జూన్ 10 వరకు నిర్వహించనున్నట్లు గతంలో UGC ఛైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీయూఈటీ పీజీ దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 27 Mar 2023 09:39 AM (IST) Tags: TTWRES Sainik School Admissions Sainik School Inter Admissions Sainik School Entrance Test Telangana Tribal Welfare Residential Educational Institutions Society Coaching For NDA/SSB Training For NDA/SSB

సంబంధిత కథనాలు

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

Eklavya Model Schools Results: ఏక‌ల‌వ్య గురుకుల విద్యాల‌యాల ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌, డైరెక్ట్ లింక్ ఇదే!

Eklavya Model Schools Results: ఏక‌ల‌వ్య గురుకుల విద్యాల‌యాల ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌, డైరెక్ట్ లింక్ ఇదే!

Medical Colleges: దేశంలో 40 వైద్యకళాశాలల గుర్తింపు రద్దు, మరో 100కి పైగా కాలేజీలకు ఇదే గతి?

Medical Colleges: దేశంలో 40 వైద్యకళాశాలల గుర్తింపు రద్దు, మరో 100కి పైగా కాలేజీలకు ఇదే గతి?

AP SSC Exams: ఏపీలో జూన్‌ 2 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

AP SSC Exams: ఏపీలో జూన్‌ 2 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

TSLPRB Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదల, 84.06 శాతం మంది అర్హత!

TSLPRB Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదల, 84.06 శాతం మంది అర్హత!

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !