GPAT: గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023, నోటిఫికేషన్ విడుదల, అర్హతలివే!
ఫార్మసీ డిగ్రీ పూర్తిచేసిన, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)-2023 నోటిఫికేషన్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)' విడుదల చేసింది. ఫార్మసీ డిగ్రీ పూర్తిచేసిన, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎం.ఫార్మసీ)లో ప్రవేశానికి జీప్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి.
వివరాలు..
* గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) - 2023
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణత, ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు..
➦ జనరల్- బాలురకు రూ.2200, బాలికలకు రూ.1100.
➦ జనరల్-EWS /ఓబీసీ(నాన్‌క్రీమిలేయర్)/ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ బాలురకు రూ.1100, బాలికలకు రూ.1100.
➦ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.1100.
పరీక్ష విధానం...
మొత్తం 500 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 5 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ & అలైడ్ సబ్జెక్ట్స్ 38 ప్రశ్నలు-152 మార్కులు, ఫార్మాస్యూటిక్స్ & అలైడ్ సబ్జెక్ట్స్ 38 ప్రశ్నలు-152 మార్కులు, ఫార్మకాగ్నసీ & అలైడ్ సబ్జెక్ట్స్ 10 ప్రశ్నలు-40 మార్కులు, ఫార్మకాలజీ & అలైడ్ సబ్జెక్ట్స్ 28 ప్రశ్నలు-112 మార్కులు, ఇతర సబ్జెక్టుల నుంచి 11 ప్రశ్నలు-44 మార్కులు కేటాయించారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి ఒకమార్కు కోత విధిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.03.2023 (05:00 P.M.)
➥ ఫీజు చెల్లింపు ప్రక్రియ: 06.03.2023 (11:50 P.M.)
➥ దరఖాస్తుల సవరణ: 07.03.2023 - 09.03.2023.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: ప్రకటించాల్సి ఉంది.
➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.
➥ పరీక్ష సమయం: 180 నిమిషాలు.
➥ ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.
Also Read:
బిట్‌శాట్- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే 21 నుంచి 26 వరకు బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1 పరీక్షలు, జూన్ 18 నుంచి 22 వరకు సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రవేశ ప్రకటన, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..