అన్వేషించండి

TS EAPCET: టీఎస్ ఈఏపీసెట్‌-2024 అగ్రి, ఫార్మా ప్రిలిమినరి 'కీ' విడుదల - అభ్యంతరాలకు అవకాశం

తెలంగాణలో అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7, 8 తేదీల్లో నిర్వహించిన ఎప్‌సెట్‌ ప్రిలిమినరీ ఆన్సర్ కీని జేఎన్‌టీయూహెచ్ మే 11న విడుదల చేసింది. అభ్యంతరాల నమోదుకు అవకాశం కల్పించింది.

TS EAPCET Answwr Key: తెలంగాణలో అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7, 8 తేదీల్లో నిర్వహించిన ఎప్‌సెట్‌ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూహెచ్ మే 11న విడుదల చేసింది. ఈ మేరకు ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షల ప్రిలిమినరి కీ విడుదలచేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు మే 11 నుంచి 13 వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 13న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలు తెలిపవచ్చు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. ఇక మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షల ప్రిలిమినరి 'కీ' మే 12న విడుదల చేయనున్నారు. 

Download Response Sheet (A&P)

Master Question Papers With Preliminary Key (A&P)

Objections on Preliminary Key (A&P)

90 శాతానికి పైగా విద్యార్థులు హాజరు..
తెలంగాణలో టీఎస్‌ఈఏపీసెట్‌-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రెండురోజుల్లోనూ 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల తొలిరోజైన జూన్ 7న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన మొదటి సెషన్‌కు 90.41 శాతం మంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన రెండో సెషన్‌కు 91.24 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా, 33,500 మందికి గాను 30,288 మంది మొదటి సెషన్‌లో, 33,505 మందికి గాను 30,571 మంది రెండో సెషన్‌లో పరీక్ష రాశారు. ఇక మే 8న నిర్వహించిన పరీక్షకు 91.67% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 33,427 మందికిగాను 30,641 మంది హాజరైనట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. జూన్ 15న ఎప్‌సెట్ ఫలితాలను ప్రకటించనున్నారు.

మే 12న ఇంజినీరింగ్ ఆన్సర్ కీ..
ఇక రాష్ట్రంలో ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 11తో పరీక్షలు ముగిశాయి. పరీక్షల మొదటిరోజు ఉదయం విడతకు 50,978 మందికిగాను.. 48,076 (94.3 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక 2,902 (5.7 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం విడతకు 50,983 మందికిగాను.. 48,152 (94.4 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2,831 (5.6 శాతం) మంది గైర్హాజరయ్యారు. ఇక పరీక్షల రెండో రోజు 50,990 మందికిగాను.. 48,097 (94.3 శాతం) మంది  మధ్యాహ్నం విడతలో 50,987 మందికిగాను.. 48,318 (94.8 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని మే 12 ఉదయం విడుదల చేయనున్నారు. విద్యార్థులు కీ తో పాటు రెస్పాన్స్ షీట్, ప్రశ్నపత్రాన్ని ఎప్సెట్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఉంటే మే 14 ఉదయం 10 గంటల వరకు పంపుకోవచ్చు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget