అన్వేషించండి

JEE Main Result 2026: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల! 100 పర్సంటైంల్‌ సాధించిన 12 మందిలో ముగ్గురు తెలుగు విద్యార్థులే!

JEE Main Result 2026: NTA విడుదల చేసిన తుది సమాధాన కీ ఆధారంగా ఫలితం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల, తెలుగు విద్యార్థులు టాప్.
  • దేశవ్యాప్తంగా 12 మందికి 100 పర్సంటైల్, ముగ్గురు తెలుగువారే.
  • JEE అడ్వాన్స్డ్‌ 2026కి అర్హత, స్కోర్‌కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.
  • రెండో విడత పరీక్ష ఏప్రిల్ 2-9, మెరుగైన స్కోర్‌ పరిగణనలోకి.

దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం సాయంత్రం ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో మన తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి టాప్ లేపారు. 

ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పేపర్‌-1 ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోరు సాధించగా అందులో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిత్‌, మోహిత్ అనే విద్యార్థులు, తెలంగాణ నుంచి వివాన్‌ మహిశ్వరి వందకు వంద పర్సంటైల్‌ సాధించారు. 

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షకు 13,55,293 మంది రిజిస్టర్ చేసుకోగా 13,04,653 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షను జనవరి 21,22, 23, 24, 28, తేదీల్లో నిర్వహించారు. 

స్కోర్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మీ స్కోర్ కార్డు పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. 

  • 1. ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక రిజల్ట్స్‌ లింక్‌ ఓపెన్ చేయాలి. 
  • 2. అక్కడ అప్లికేషన్ నెంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయాలి. 
  • 3. క్యాప్చా కోడ్‌ సరిగా టైప్ చేసి సబ్‌మీట్ చేయాలి. 
  • 4. మీ స్కోర్ కార్డ్‌ స్క్రీన‌ మీద కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం మంచిది. 

స్కోర్‌కార్డ్‌లో ఏముంటుంది?

  1. • మొత్తం మీద పర్సంటైల్ స్కోరు
  2. • సబ్జెక్ట్ వారీగా పర్సంటైల్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం)
  3. • ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)
  4. • క్వాలిఫైంగ్‌ స్టాటస్‌ (JEE అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారా లేదా అని)

మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ఏం చేయాలి?

  • అర్హత సాధించిన విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్ 2026కి దరఖాస్తు చేసుకోగలరు.
  • సెషన్ 2కి హాజరయ్యే విద్యార్థులకు ఇది మొదటి అవకాశం. రెండు సెషన్ల నుంచి మెరుగైన స్కోర్‌ను తుది మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు.
  • విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే సమాచారాన్ని పొందాలని, పుకార్లను నివారించాలని సూచించారు.

మంచి పర్సంటైల్ రాని వారు ఏం చేయాలి? 

ఫలితాల విడుదలకు ముందే ఎన్టీఏ అధికారులు సోమవారం ఉదయం ఫైనల్‌ ఆన్సర్‌ కీ విడుదల చేశారు. ఈ ఫైనల్‌ కీలో ఒక కీలక మార్పు జరిగింది. మొత్తం 9 ప్రశ్నలను డ్రాప్‌ చేశారు. అంటే ఈ ప్రశ్నలకు మార్కుల కేటాయింపులో ఎన్టీఏ నిబంధనల ప్రకారం మార్పులు ఉంటాయి. ఒక వేళ మొదటి విడతలో వచ్చిన స్కోరుతో మీరు సంతృప్తి చెందకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. జేఈఈ మెయన్ రెండో విడత పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. మొదటి విడత, రెండో విడత ఈ రెండింటిలో మీకు ఏ పరీక్షలో ఎక్కువ స్కోరు వస్తే దానినే ర్యాంకు కేటాయింపునకు పరిగణలోకి తీసుకుంటారు. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి.           

Frequently Asked Questions

జేఈఈ మెయిన్ ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యాయి?

జేఈఈ మెయిన్ ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి.

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షకు ఎంతమంది హాజరయ్యారు?

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షకు 13,55,293 మంది రిజిస్టర్ చేసుకోగా, 13,04,653 మంది పరీక్ష రాశారు.

జేఈఈ మెయిన్ ఫలితాల స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

స్కోర్ కార్డ్ లో ఏమేమి ఉంటాయి?

స్కోర్ కార్డ్ లో మొత్తం పర్సంటైల్ స్కోరు, సబ్జెక్ట్ వారీగా పర్సంటైల్, ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), మరియు JEE అడ్వాన్స్డ్ కు అర్హత సాధించారా లేదా అనే క్వాలిఫైయింగ్ స్టేటస్ ఉంటాయి.

మంచి పర్సంటైల్ రాకపోతే ఏమి చేయాలి?

మంచి పర్సంటైల్ రాకపోతే, జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండింటిలో మెరుగైన స్కోర్ ర్యాంకు కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోబడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget