By: ABP Desam | Updated at : 10 Jul 2023 11:44 PM (IST)
Edited By: omeprakash
అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశాలు
శ్రీకాకుళంలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ, బొల్లినేని మెడ్‌స్కిల్స్ సహకారంతో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి మెడికల్ డిగ్రీతోపాటు సాధారణ డిగ్రీ ఉన్నవారు ఈ కోర్సులకు అర్హులు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు వివరాలు..
➥ మాస్టర్ ఆఫ్ హెల్త్‌కేర్ అడ్మినిస్ట్రేషన్: 40 సీట్లు
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
➥ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్స్ & హెల్త్ ఇన్‌ఫర్మేషన్: 40 సీట్లు
కోర్సు వ్యవధి: ఏడాది.
అర్హత: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఏ, బీకాం, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. ''The Principal, College of Arts, Commerce, Law & Education, Dr.B.R.Ambedkar University, Etcherla, Srikakulam'', పేరిట రూ.250 డిడి తీసి, దరఖాస్తుతోపాటు జతచేసి సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
O/o: Director of Admissions,
Dr.B.R.Ambedkar University,
Etcherla, Srikakulam-532 410.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 11.08.2023.
➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.08.2023.
ALSO READ:
ఎంబీబీఎస్, బీడీఎస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం (జులై 7) ప్రారంభించింది. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జులై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్ కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించినవారే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు. జనరల్ క్యాటగిరీకి, ఈడబ్ల్యూఎస్ కోటాకు 137 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆయా క్యాటగిరీల్లోని దివ్యాంగులకు 107 మార్కులు (40 శాతం), జనరల్ క్యాటగిరీ దివ్యాంగులకు 121 మార్కులు (45 శాతం) కటాఫ్‌గా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జులై రెండోవారంలో ఎంబీబీఎస్ ప్రవేశ ప్రకటన, 6 వేలకు పైగా సీట్లు అందుబాటులో!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు జులై రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకు సంబంధించి విజయవాడలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని 16 ప్రభుత్వ, 17 ప్రైవేటు వైద్య కళాశాలల్లో దాదాపు 6,109 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన (2014 జూన్ 2) తర్వాత ఏపీలో ఏర్పడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అన్-రిజర్వుడ్(స్థానికేతర) సీట్లను ఏపీ విద్యార్థులతోనే భర్తీచేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో 5 శాతం రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!
తెలంగాణలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం(జులై 6న) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించడం జరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్ కోర్సుల్లో సరికొత్త సిలబస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి
CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
Extra Ordinary Man: ఎక్స్ట్రా మాస్ స్టెప్స్ - శ్రీ లీలతో డ్యాన్స్ ఇరగదీసిన నితిన్!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్స్,లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రం మాస్టర్ ప్లాన్
/body>