అన్వేషించండి

AP MBBS Admissions: జులై రెండోవారంలో ఎంబీబీఎస్‌ ప్రవేశ ప్రకటన, 6 వేలకు పైగా సీట్లు అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో  2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలకు జులై రెండో వారంలో  నోటిఫికేషన్‌ వెలువడనుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో  2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలకు జులై రెండో వారంలో  నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇందుకు సంబంధించి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని 16 ప్రభుత్వ, 17 ప్రైవేటు వైద్య కళాశాలల్లో దాదాపు 6,109 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

స్థానికేతర సీట్లు ఏపీ విద్యార్థులకే..
రాష్ట్ర విభజన జరిగిన (2014 జూన్ 2) తర్వాత ఏపీలో ఏర్పడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అన్-రిజర్వుడ్(స్థానికేతర) సీట్లను ఏపీ విద్యార్థులతోనే భర్తీచేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏసీఆర్, పద్మావతి, గాయత్రీ, నిమ్రా, బాలాజీ, విశ్వభారతి, అపోలో కళాశాలల్లో, ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా వచ్చిన మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, రాజమహేంద్రవరం, ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని అన్ని సీట్లను రాష్ట్ర విద్యార్థులతో భర్తీచేసేలా ఉత్తర్వులు రానున్నాయి. దీనివల్ల సుమారు 200 ఎంబీబీఎస్ సీట్లు స్థానిక కోటాలో అదనంగా వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం విభజన తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని అన్ని సీట్లను తమ రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోనికి వస్తుందని కూడా వెల్లడించింది. దీంతో ఏపీ విద్యార్థులు తెలంగాణలో అన్ రిజర్వుడ్ కోటాలో సీట్లు పొందే అవకాశాన్ని కోల్పోయారు.

ALSO READ:

KNRUHS: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం (జులై 7) ప్రారంభించింది. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జులై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్‌ కటాఫ్‌ కన్నా ఎక్కువ మార్కులు సాధించినవారే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు. జనరల్‌ క్యాటగిరీకి, ఈడబ్ల్యూఎస్‌ కోటాకు 137 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆయా క్యాటగిరీల్లోని దివ్యాంగులకు 107 మార్కులు (40 శాతం), జనరల్‌ క్యాటగిరీ దివ్యాంగులకు 121 మార్కులు (45 శాతం) కటాఫ్‌గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజును జనరల్‌, బీసీ క్యాటగిరీ విద్యార్థులు రూ.3,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,900 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in సంప్రదించవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

సింగ‌రేణి ఉద్యోగుల పిల్లల‌కు ఎంబీబీఎస్ సీట్లలో 5 శాతం రిజ‌ర్వేష‌న్లు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!
తెలంగాణలోని సింగ‌రేణి ఉద్యోగుల పిల్లల‌కు రాష్ట్ర ప్రభుత్వం శుభ‌వార్త వినిపించింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్‌ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం(జులై 6న) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్ల‌ల‌కు కేటాయించడం జరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్‌లో బైపీసీనా, ఎంబీబీఎస్ సీటు రాకపోయినా సరే - మరెన్నో కోర్సులున్నాయి!
ఇంటర్ లో బైపీసీ తీసుకొని.. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక చాలా మంది విపరీతంగా భయపడిపోతుంటారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ లో సీటు రాకపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. బీఏఎంస్, బీహెచ్ఎంఎస్, బీడీఎఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల్లో చేరుతుంటారు. మరికొంత మంది విదేశాల్లోనూ వైద్య విద్య అభ్యసించడానికి వెళ్తుంటారు. కానీ ఇంటర్ లో బైపీసీ చదివి ఎంబీబీఎస్ యే కాకుండా ఆ తర్వాత చదివేందుకు అనేక కోర్సులు ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP DesamNita Ambani Saree and jewelry | Trump Swearing Ceremony లో ప్రధాన ఆకర్షణగా నీతా,ముకేశ్ అంబానీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
CM Chandrababu: 'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
Nara Lokesh: 'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
Embed widget