అన్వేషించండి

Future With BiPC: ఇంటర్‌లో బైపీసీనా, ఎంబీబీఎస్ సీటు రాకపోయినా సరే - మరెన్నో కోర్సులున్నాయి!

Future With BiPC: ఇంటర్ లో బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ లో సీటు రాకపోతే ఏం చేయాలో తెలియక చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఇంటర్ తర్వాత చాలా కోర్సులు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

BiPC Students Future With Other Than MBBS: ఇంటర్ లో బైపీసీ తీసుకొని.. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక చాలా మంది విపరీతంగా భయపడిపోతుంటారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ లో సీటు రాకపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. బీఏఎంస్, బీహెచ్ఎంఎస్, బీడీఎఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల్లో చేరుతుంటారు. మరికొంత మంది విదేశాల్లోనూ వైద్య విద్య అభ్యసించడానికి వెళ్తుంటారు. కానీ ఇంటర్ లో బైపీసీ చదివి ఎంబీబీఎస్ యే కాకుండా ఆ తర్వాత చదివేందుకు అనేక కోర్సులు ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

1. స్పెషల్ బీఎస్సీ:

అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, సెరీ కల్చర్ వంటి అనేక విభాగాల్లో నాలుగేళ్ల కోర్సులు అందుబాటు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 70కి పైగా సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ తరఫున ఎన్టీఏ నిర్వహించే ఏఐఈఈఏ పరీక్ష రాయాలి. ఏపీ, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఎంసెట్/ఈఏపీ సెట్ స్కోరుతో అవకాశం కల్పిస్తారు. వీటితో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. 

2. జనరల్ బీఎస్సీ:

బైపీసీ విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్న చదువుల్లో బీఎస్సీ ముఖ్యమైంది. ఇందులో నచ్చిన మూడు కోర్ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఏదైనా ఒక సబ్జెక్టును ఆనర్స్ విధానంలో నాలుగేళ్ల వ్యవధితోనూ పూర్తి చేసుకోవచ్చు. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఆక్వాకల్చర్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర సబ్జెక్టులను బీఎస్సీలో భాగంగా ఎంచుకోవచ్చు. తర్వాత వీటిలోనే పీజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో చేరవచ్చు. ఇంటర్ మార్కులతో ఏపీ, తెలంగాణల్లో ప్రవేశాలు ఉంటాయి. 

3. బీఫార్మసీ:

ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ ఎంచుకోవచ్చు. ఎంసెట్ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. సగం సీట్లు బైపీసీ విద్యార్థులకు కేటాయించారు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులు అందిస్తున్నాయి. 

4. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ:

ఇంటర్ బైపీసీ తర్వాత నేరుగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ చదువుకోవచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పెద్ద సంఖ్యలో ఈ కోర్సులు ఉన్నాయి. సీయూసెట్ తో వీటిలో అవకాశం లభిస్తుంది. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలూ ఈ తరహా కోర్సులు బోధిస్తున్నాయి. బోటనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయోలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ తదితర సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. 

5. బీఎస్ - ఎంఎస్:

ఐఐఎస్సీ నాలుగేళ్ల బీఎస్ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరినవారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తి చేసుకొని ఎంఎస్ పట్టా పొందవచ్చు. ఈ తరహాలోనే ఐఐఎస్ఈఆర్ లు బీఎస్ - ఎంఎస్ కోర్సులను ఐదేళ్ల వ్యవధితో నడుపుతున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. పరీక్షలో ప్రతిభ, నీట్ స్కోరుతో ప్రవేశాలు లభిస్తాయి. 

6. ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్:

బోధన రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సు వైపు అడుగులు వేయవచ్చు. పేరొందిన సంస్థల్లో వీటిని పూర్తి చేసుకొని ఏడాది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మైసూరు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్ కోర్సును నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఈ విధానం ద్వారా రెండేళ్ల డీఎడ్ కోర్సుల్లో చేరవచ్చు. 

7. నర్సింగ్:

బీఎస్సీ నర్సింగ్ కు ప్రాధాన్యం పెరుగుతోంది. బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి మొత్తం నాలుగేళ్లు. జాతీయ సంస్థలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఎంసెట్/నీట్ ర్యాంకుతో అవకాశం కల్పిస్తారు. బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఎమ్మెస్సీ నర్సింగ్ ఆ తర్వాత ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసుకోవచ్చు. 

Also Read: Scholarships 2023: 9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?

8. ఫిజియోథెరపీ:

బైపీసీ విద్యార్థులు పరిగణించాల్సిన వాటిలో ఫిజియోథెరపీ ఒకటి. దీన్ని పూర్తి చేసుకున్నవారికి ఉపాధికి ఢోకా ఉండదు. ఏపీ, తెలంగాణల్లో సుమారు 50 కాలేజీలు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరఫీ కోర్సు అందిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రత్యేక సంస్థలూ ఉన్నాయి. అలాగే ఎయిమ్స్ తో పాటు పేరున్న సంస్థలు ఎన్నో ఈ కోర్సు అందిస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ కోర్సు చదవవచ్చు. 

9. పారా మెడికల్:

కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందడానికి పారా మెడికల్ కోర్సులు దారి చూపుతాయి. వీరు ఆసుపత్రులు డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో సేవలు అందించవచ్చు. అనస్థీషియా టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, యూరాలజీ టెక్నాలజీ, పర్ ఫ్యూజన్ టెక్నాలజీ, న్యూరో మానిటరింగ్ టెక్నాలజీ, ఆర్థో పెడిక్స్ టెక్నాలజీ, డెంటల్ హైజీనిస్ట్, డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్, ఆప్టోమెరీ తదితర బ్యాచిలర్ కోర్సులు బైపీసీ విద్యార్థులు చదువుకోవచ్చు. మూడు, మూడున్నర, నాలుగేళ్ల పాటు ఈ కోర్సు వ్యవధి ఉంటుంది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget