అన్వేషించండి

KNRUHS: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 7న ప్రారంభమైంది. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జులై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం (జులై 7) ప్రారంభించింది. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జులై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్‌ కటాఫ్‌ కన్నా ఎక్కువ మార్కులు సాధించినవారే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు. జనరల్‌ క్యాటగిరీకి, ఈడబ్ల్యూఎస్‌ కోటాకు 137 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆయా క్యాటగిరీల్లోని దివ్యాంగులకు 107 మార్కులు (40 శాతం), జనరల్‌ క్యాటగిరీ దివ్యాంగులకు 121 మార్కులు (45 శాతం) కటాఫ్‌గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజును జనరల్‌, బీసీ క్యాటగిరీ విద్యార్థులు రూ.3,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,900 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in సంప్రదించవచ్చు.

520 మెడికల్‌ సీట్లు అదనంగా..
రాష్ట్రంలో 56 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 8,340 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 15 శాతం సీట్లు ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగతా సీట్లు రాష్ట్ర కోటాలో కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో భర్తీ చేస్తారు. 2014 జూన్‌ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను 100 శాతం తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్‌ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు అదనంగా 520 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్‌ కాలేజీలు ఉండగా, తొమ్మిదేళ్లలో కొత్తగా 36 కాలేజీలు వచ్చాయి.

ఇప్పటికే ఎంబీబీఎస్ బి కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు రాష్ట్ర  విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసింది ప్రభుత్వం. దాంతో  తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 15 శాతం సీట్లు అన్ రిజర్వుడు సైతం తొలగించడంతో అదనంగా 520 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కనున్నాయి. ఓవరాల్ గా 1820 సీట్లు తాజాగా అందుబాటులోకి రానుండగా, రాష్ట్ర విద్యార్థుల వైద్యవిద్య కల సాకారం అవుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

NOTIFICATION

ONLINE REGISTRATION

PROSPECTUS

ALSO READ:

సింగ‌రేణి ఉద్యోగుల పిల్లల‌కు ఎంబీబీఎస్ సీట్లలో 5 శాతం రిజ‌ర్వేష‌న్లు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!
తెలంగాణలోని సింగ‌రేణి ఉద్యోగుల పిల్లల‌కు రాష్ట్ర ప్రభుత్వం శుభ‌వార్త వినిపించింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్‌ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం(జులై 6న) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్ల‌ల‌కు కేటాయించడం జరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్‌లో బైపీసీనా, ఎంబీబీఎస్ సీటు రాకపోయినా సరే - మరెన్నో కోర్సులున్నాయి!
ఇంటర్ లో బైపీసీ తీసుకొని.. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక చాలా మంది విపరీతంగా భయపడిపోతుంటారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ లో సీటు రాకపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. బీఏఎంస్, బీహెచ్ఎంఎస్, బీడీఎఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల్లో చేరుతుంటారు. మరికొంత మంది విదేశాల్లోనూ వైద్య విద్య అభ్యసించడానికి వెళ్తుంటారు. కానీ ఇంటర్ లో బైపీసీ చదివి ఎంబీబీఎస్ యే కాకుండా ఆ తర్వాత చదివేందుకు అనేక కోర్సులు ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget