DOST Application: 'దోస్త్' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, తొలివిడత రిజిస్ట్రేషన్ ఎప్పటివరకంటే?
DOST: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ మే 3న ప్రారంభమైంది. మే 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.

DOST 2025 Online Registration: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఆన్‌లైన్ దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 3న ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి మే 21 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత మే 10 నుంచి 22 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. విద్యార్థులకు మే 29న సీట్లను కేటాయించనున్నారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి రెండు, మూడో విడతల్లోనూ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రెండు, మూడో విడతల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ 30 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.
తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 3 నుంచి జూన్ 23 వరకు మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో మే 3 నుంచి 21 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి, మే 10 నుంచి 22 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. విద్యార్థులకు మే 29న సీట్లను కేటాయించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 8 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి, మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. రెండో విడత సీట్లను జూన్ 13న కేటాయించనున్నారు. ఇక చివరి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 13 నుంచి 19 వరకు నిర్వహించి.. జూన్ 13 నుంచి 19 మధ్య వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. వీరికి జూన్ 23న సీట్లను కేటాయించనున్నారు. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 24 నుంచి 28 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
దోస్త్ 2025 షెడ్యూలు..
మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బీకాం హానర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
మొదటి దశ ప్రవేశాలు ఇలా..
➥ మే 3 నుంచి 21 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
➥ రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు.
➥ విద్యార్థులకు మే 29న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు.
రెండో దశ ప్రవేశాలు ఇలా..
➥ రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగనుంది.
➥ రెండో విడత వెబ్ ఆప్షన్లకు మే 30 నుంచి జూన్ 9 వరకు అవకాశం కల్పించనున్నారు.
➥ విద్యార్థులకు జూన్ 13న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.
మూడో విడత ప్రవేశాలు ఇలా..
➥ దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 13న ప్రారంభంకానుంది.
➥ విద్యార్థులు జూన్ 19 వరకు దరఖాస్తులు సమర్పించాలి.
➥ చివరి విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.
➥ విద్యార్థులకు జూన్ 23న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.
➥ జూన్ 30 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.





















