అన్వేషించండి

DOST 2025 Notification: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 'దోస్త్‌' నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇలా

DOST: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 2025-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పించనున్నారు.

DOST 2025 Notification: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 2025-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ (DOST - Degree Online Services Telangana) నోటిఫికేషన్‌ మే 2న వెలువడింది. మే 3 నుంచి జూన్ 23 వరకు మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇక రెండు, మూడో విడతల్లో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 3 నుంచి 21 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి, మే 10 నుంచి 22 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. విద్యార్థులకు మే 29న సీట్లను కేటాయించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 8 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి, మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. రెండో విడత సీట్లను  జూన్ 13న కేటాయించనున్నారు. ఇక చివరి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 13 నుంచి 19 వరకు నిర్వహించి.. జూన్ 13 నుంచి 19 మధ్య వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. వీరికి జూన్ 23న సీట్లను కేటాయించనున్నారు. 

ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ 30 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం 'దోస్త్‌' ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి 'దోస్త్‌' ప్రవేశాల పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీచేస్తారు. 

దోస్త్ 2025 షెడ్యూలు..

మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

మొదటి దశ ప్రవేశాలు ఇలా..

➥ మే 3 నుంచి 21 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

➥  రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు.

➥  విద్యార్థులకు మే 29న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు.

రెండో దశ ప్రవేశాలు ఇలా..

➥  రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగనుంది.

➥  రెండో విడత వెబ్ ఆప్షన్లకు మే 30 నుంచి జూన్ 9 వరకు అవకాశం కల్పించనున్నారు.

➥  విద్యార్థులకు జూన్ 13న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

మూడో విడత ప్రవేశాలు ఇలా..

➥ దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 13న ప్రారంభంకానుంది.

➥ విద్యార్థులు జూన్ 19 వరకు దరఖాస్తులు సమర్పించాలి.

➥  చివరి విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.

➥ విద్యార్థులకు జూన్ 23న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

➥  జూన్ 30 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.

WEBSITE

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Embed widget