Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
భారత్, వెస్టిండీస్ మధ్య గౌహతి వేదికగా జరిగిన రెండో వన్డేలో ఏకంగా 400 పై పరుగులు చేయడంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లతో ఏం ఫాయిదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించినప్పటికీ, గంభీర్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.
మ్యాచ్ తర్వాత మాట్లాడిన గంభీర్.. బ్యాట్‌కు, బాల్ కు మధ్య సరైన పోటీ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇది అసలైన క్రికెట్ కాదని, కేవలం బ్యాటింగ్ మాత్రమేనని ఘాటు విమర్శలు చేశారు. వెస్టిండీస్ 400కు పైన పరుగులు చేయడం, ఆపై భారత్ దానిని ఛేదించడం బ్రాడ్కాస్టర్లకు, ప్రేక్షకులకు వినోదాన్ని పంచవచ్చు కానీ.. ఒక కోచ్‌గా, నిజమైన క్రికెట్ అభిమానిగా తాను మాత్రం సంతృప్తిగా లేనని స్పష్టం చేశారు.
కేవలం బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్లను తయారు చేయకుండా, బౌలర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఇలాంటి పిచ్‌లపై బౌలింగ్ చేసే యంగ్ ప్లేయర్స్ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలన్నారు. అరంగేట్ర పేసర్ అకిబ్ నబీతో పాటు ఇతర బౌలర్లకు ఈ మ్యాచ్ కలిసి రాలేదని, అయినప్పటికీ వచ్చే మ్యాచ్‌లో అకిబ్కు కచ్చితంగా అవకాశం ఇస్తామని గంభీర్ స్పష్టం చేశారు. 2027 వన్డే ప్రపంచకప్‌నకు సమయం తక్కువగా ఉందని, ఐపీఎల్, బిలాటరల్ సిరీస్ పోను ప్రపంచకప్‌కు ముందు భారత్ మరో 20 వన్డేలు మాత్రమే ఆడుతుందని తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















