India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య మరో హైఓల్టేజ్ సమరానికి రంగం సిద్ధమైంది. సెమీస్లో విజయాలు సాధించి ఇరు జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్ అనగానే ఉత్కంఠ నెలకొనడం సహజం. కాని ఈసారి మరింత ఆసక్తికర చర్చ నడుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ప్లేయర్స్ తో షేక్ హ్యాండ్ చేసేందుకు భారత్ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లలోనూ మన ప్లేయర్స్ పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని కూడా అందుకోలేదు. మహిళా జట్టు కూడా ఇదే బాట నడిచింది.
మరి ఈ ఆసియా క్రీడల ఫైనల్లో భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య కరచాలనం ఉంటుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం షేక్ హ్యాండ్ ఇవ్వాలనే కచ్చితమైన రూల్స్ ఏమీ లేవు.
ఇక ఈ మ్యాచ్కు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో పాటు ఐసీసీ ఛైర్మన్ జైషా హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవల మహిళల ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా మోహ్సిన్ నఖ్వీకి సైకియా షేక్ హ్యాండ్ ఇవ్వడం పెద్ద వివాదమే అయింది. అయితే మ్యాచ్ ముగిశాక మెడల్స్ ప్రదానోత్సవంలో మాత్రం ఇరు జట్లు పోడియం పంచుకోవాల్సిందే. మహిళా జట్టు కూడా గతంలో పోడియం పంచుకున్న నేపథ్యంలో, పురుషుల ఫైనల్లో ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
ట్రెండింగ్ వార్తలు






















