అన్వేషించండి

CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

CBSE 10th Rules: 2027 సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి పరీక్షల్లో మార్పు చేస్తారనే ప్రచారంపై క్లారిటీ వచ్చింది. ఈ విద్యాసంవత్సరానికి పాత విధానంలోనే ఎగ్జామ్స్ జరుగుతాయని స్పష్టం చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2026-27 పదో తరగతి ఉత్తీర్ణత ప్రమాణాలు మారవని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
  • బోర్డు, ఇంటర్నల్ మార్కులు కలిపి 33% సాధిస్తే సరిపోతుంది.
  • వేర్వేరుగా 33% మార్కుల ప్రచారంపై బోర్డు స్పష్టతనిచ్చింది.
  • పరీక్ష విధానం, సిలబస్, మూల్యాంకనంలో కూడా మార్పులు లేవు.

CBSE 10th Rules:  వచ్చే ఏడాది సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత ప్రమాణాలలో ఎలాంటి మార్పులు ఉండబోవని బోర్డు స్పష్టం చేసింది.

ఉత్తీర్ణత విధానం  

ఒక సబ్జెక్టులో పాస్ కావాలంటే విద్యార్థులు బోర్డు ఎగ్జామ్,  ఇంటర్నల్ అసెస్‌మెంట్ రెండింటిలో కలిపి మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. అంటే, 80 మార్కుల బోర్డు పరీక్షలోనూ, 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌‌మెంట్‌లోనూ విడివిడిగా 33 శాతం మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిలోనూ మార్కులను కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తారు. అయితే, విద్యార్థి తప్పనిసరిగా బోర్డు ఎగ్జామ్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ రెండింటికీ హాజరై ఉండాలి.

గందరగోళానికి తెర

ఇటీవల 2026-27 పాఠ్యప్రణాళికకు సంబంధించి వచ్చిన కొన్ని మార్పుల వల్ల బోర్డు పరీక్షలు, ఇంటర్నెల్ అసెస్మెంట్ విడివిడిగా 33 శాతం మార్కులు సాధించాలనే ప్రచారం జరిగింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. దీనిపై హర్యానాలోని సోనిపట్ స్కూల్ ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు సీబీఎస్ఈ వెబినార్ ద్వారా స్పష్టతనిచ్చింది. గతంలో ప్రత్యేక నిబంధనలపై చర్చ జరిగినా, ప్రస్తుతానికి దానిని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. 2025-26 విద్యా సంవత్సరంలో అమలైన పాత నిబంధనలే 2026-27కి కూడా వర్తిస్తాయని తేల్చిచెప్పింది.

Also Read: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?

12వ తరగతి నిబంధనలు వేరు

10వ తరగతి విషయానికి వస్తే ఇలా ఉంటే, 12వ తరగతి విద్యార్థులకు మాత్రం ప్రాక్టికల్, థియరీ వేర్వేరుగా ఉత్తీర్ణత ప్రమాణాలు ఉన్నాయని సీబీఎస్ఈ బోర్డు గుర్తుచేసింది.

పరీక్షా విధానంలోనూ ఎలాంటి మార్పులు లేవు

ఉత్తీర్ణత ప్రమాణాలతో పాటు, 2026-27 విద్యా సంవత్సరానికి ఎగ్జామ్ పేపర్ రూపొందించడం, సిలబస్, కరెక్షన్ విధానంలోనూ ఎటువంటి మార్పులు లేవని సీబీఎస్ఈ పేర్కొంది.

10, 12వ తరగతుల విద్యార్థుల కోసం బోర్డు ఇప్పటికే శాంపిల్ ఎగ్జామ్ పేపర్స్ , మార్కింగ్ స్కీమ్‌లను సిద్ధం చేసింది. ప్రశ్నపత్రాల సరళి, మార్కుల వెయిటేజీని అర్థం చేసుకోవడానికి విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు.  

Also Read: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?

Frequently Asked Questions

2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఉత్తీర్ణత ప్రమాణాల గురించి CBSE ఏమి స్పష్టం చేసింది?

2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఉత్తీర్ణత ప్రమాణాలలో ఎలాంటి మార్పులు ఉండబోవని CBSE స్పష్టం చేసింది. 2025-26లో అమలులో ఉన్న పాత నిబంధనలే కొనసాగుతాయి.

10వ తరగతిలో ఒక సబ్జెక్టులో పాస్ కావడానికి ఎన్ని మార్కులు అవసరం?

బోర్డు ఎగ్జామ్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ రెండింటిలో కలిపి మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. విడివిడిగా 33 శాతం అవసరం లేదు.

ఉత్తీర్ణత ప్రమాణాలపై గందరగోళం ఎందుకు ఏర్పడింది?

2026-27 పాఠ్యప్రణాళిక మార్పుల వల్ల బోర్డు పరీక్షలు, ఇంటర్నెల్ అసెస్‌మెంట్‌లో విడివిడిగా 33% మార్కులు సాధించాలనే ప్రచారం జరిగింది. దీనిపై CBSE వెబినార్ ద్వారా స్పష్టతనిచ్చింది.

10వ తరగతి పరీక్షా విధానం లేదా సిలబస్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా?

లేదు, 2026-27 విద్యా సంవత్సరానికి పరీక్షా పేపర్ రూపకల్పన, సిలబస్, కరెక్షన్ విధానంలోనూ ఎలాంటి మార్పులు లేవని CBSE పేర్కొంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget