అన్వేషించండి

WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (WagonR) వాహనంపై కంపెనీ రూ. 64,600 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, మైలేజ్, ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌పై అక్టోబర్‌లో రూ. 64,600 తగ్గింపు.
  • నగదు, ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఇతర ప్రయోజనాలతో ఈ ఆఫర్ లభ్యం.
  • అద్భుత మైలేజ్, విశాలమైన ఇంటీరియర్, కీలక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
  • పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లు లీటరుకు 33 కి.మీ మైలేజీ ఇస్తుంది.

భారత్‌లో ఎప్పటి నుంచో మారుతి సుజుకి కంపెనీ కార్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికీ కంపెనీ దేశంలో అత్యధికంగా కార్లను విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో విక్రయాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక అక్టోబర్‌లో మారుతి సుజుకి కి చెందిన వ్యాగన్ ఆర్ పై ఒక ప్రత్యేక ఆఫర్ వచ్చింది. పండుగల సీజన్ ప్రారంభంతో కంపెనీ అక్టోబర్ 2026 లో వ్యాగన్ ఆర్ పై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది.

మీరు కనుక అక్టోబర్ నెలలో వ్యాగన్ ఆర్ పై మొత్తం రూ. 64,600 వరకు ఆదా చేయవచ్చు. భారత రోడ్లపై సెట్ అయ్యే, అద్భుతమైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా ఈ కారు నిరంతరం బెస్ట్-సెల్లింగ్ జాబితాలో కొనసాగుతోంది. మరి ఈ డిస్కౌంట్ ప్రయోజనాన్ని మీరు ఎలా పొందవచ్చో, ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

డిస్కౌంట్ ఎలా వస్తుంది

వాస్తవానికి మారుతి సుజుకి అందిస్తున్న ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్‌లో పలు రకాల బెనిఫిట్స్ కలిసి ఉన్నాయి. కంపెనీ వినియోగదారులకు నేరుగా రూ. 35,000 వరకు ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్‌ ఇస్తోంది. అక్టోబర్ 20 వరకు కారు బుకింగ్, డెలివరీ తీసుకునే కస్టమర్లకు అదనంగా రూ. 7,100 తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది.

 మీ పాత వాహనాన్ని మార్చుకుని (ఎక్స్ఛేంజ్) కొత్త వ్యాగన్ ఆర్ తీసుకుంటే కనుక మీకు రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తుంది. దీంతో పాటు రూ. 10,000 స్మార్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాన్ సహా రూ. 2,500 ఇన్స్టిట్యూషనల్ ఆఫర్ కూడా మారుతి కంపెనీ అందిస్తోంది. అన్ని బెనిఫిట్స్ కలిపితే మీకు మొత్తం పొదుపు రూ. 64,600 వరకు అవుతుంది.

వ్యాగన్ ఆర్ సిగ్నేచర్ 'టాల్-బాయ్ డిజైన్' దానికి భిన్నమైన లుక్‌తో పాటు కారు లోపల స్పేస్ కూడా అందిస్తుంది. కారు లోపల 7-అంగుళాల స్మార్ట్‌‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇక లాంగ్ జర్నీ ప్రయాణాల కోసం కారులో సౌకర్యవంతమైన సీట్లు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 341 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఇచ్చింది. దీనివల్ల ఫ్యామిలీ లగేజీ సులభంగా సరిపోతుంది.

ఇంజిన్ చాలా పవర్ ఫుల్ 

వ్యాగన్ ఆర్ 1.0 లీటర్, 1.2 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. కారులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ సైతం అందుబాటులో ఉంది. సేఫ్టీ పరంగా ఈ కారు మారుతి హార్టెక్ట్ (HEARTECT) ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. రోజువారీ వినియోగం, సేఫ్ జర్నీ దృష్టిలో ఉంచుకుని ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తో కూడిన EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్లు ఇచ్చింది. 

33 కి.మీ అధిక మైలేజ్

మైలేజ్ విషయంలో మారుతి కారు ఎల్లప్పుడూ బెస్ట్ అనిపించుకుంటోంది. వ్యాగన్ ఆర్ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.56 నుంచి 25.19 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో సిఎన్‌జి (CNG) మోడల్ కేజీకి 33.47 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 4.99 లక్షలకు ప్రారంభం కాగా, దీని టాప్-ఎండ్ మోడల్  ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.45 లక్షల వరకు ఉంటుంది.

Frequently Asked Questions

అక్టోబర్ నెలలో మారుతి వ్యాగన్ ఆర్ పై ఎంతవరకు పొదుపు చేయవచ్చు?

అక్టోబర్ నెలలో మారుతి వ్యాగన్ ఆర్ కారుపై గరిష్టంగా రూ. 64,600 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో నగదు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, అదనపు తగ్గింపు వంటివి కలిసి ఉంటాయి.

వ్యాగన్ ఆర్ పై లభించే డిస్కౌంట్లలో ఏయే రకాలు ఉన్నాయి?

రూ. 35,000 నగదు డిస్కౌంట్, రూ. 7,100 అదనపు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 స్మార్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాన్, రూ. 2,500 సంస్థాగత ఆఫర్ ఉన్నాయి.

మారుతి వ్యాగన్ ఆర్ మైలేజ్ ఎంత?

పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.56 నుంచి 25.19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సిఎన్‌జి మోడల్ కేజీకి 33.47 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

మారుతి వ్యాగన్ ఆర్ ప్రారంభ ధర ఎంత?

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 7.45 లక్షల వరకు ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget