By: ABP Desam | Updated at : 24 Feb 2023 05:36 AM (IST)
Edited By: omeprakash
డిగ్రీ విద్యలో మార్పులు
తెలంగాణలో డిగ్రీ విద్య స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లోని సెస్‌లో “అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి” కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దక్షిణ భారత బ్రిటీష్ కౌన్సిల్, యూకేలోని బంగోర్, అబిరిస్టిత్ విశ్వవిద్యాలయాలు, హైదరాబాద్‌లోని ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం 'సెస్' తో కలిసి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ రెండు రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తొలి రోజు ప్రారంభోపన్యాసం చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో వాణిజ్యశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం విభాగాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య ప్రణాళిక అమల్లోకి రానుందని ఆయన ప్రకటించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు రూపొందించేందుకు విద్యా మండలి కృషి చేస్తోందన్నారు. ఈ ప్రక్రియలో విదేశీ విశ్వవిద్యాలయాల తోడ్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. సరికొత్త విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహకారం చేస్తుందన్నారు.
బట్టి విధానంతో ఉపయోగం ఉండదు: నవీన్ మిట్టల్
బట్టి విధానంతో పరీక్షలు రాయడం వల్ల ఉపయోగం ఉండదని కాలేజీ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. చదువు తర్వాత విద్యార్థులు తేలికగా ఉపాధిపొందేలా విద్యా విధానం ఉండాలని పేర్కొన్నారు. డిగ్రీలు వాస్తవ విజ్ఞానానికి కొలమానం కావడంలేదని, ప్రస్తుత పరీక్ష విధానం విద్యార్థుల్లో దాగిఉన్న అసలైన ప్రతిభను వెలికి తీయడం లేదన్నారు. విద్యార్థుల్లో అనలిటికల్, క్రిటికల్ ఆలోచన విధానం కొరవడిందని, దీనివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ కొరవడుతోందని చెప్పారు. మారుతున్న కాలానికి పోటీ పడలేకపోతున్నారని తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పదునుపెడితే విభిన్న కోణంలో ఆలోచన విధానం మెరుగుపడుతుందని చెప్పారు. ఆ దిశగా బోధన విధానాన్ని మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా: వాకాటి కరుణ
యూఎస్, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా రాష్ట్ర ఉన్నత విద్యలో మార్పులు మంచి పరిణామమని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు. నైపుణ్యవంతమైన విద్యను యూజీ స్థాయి నుంచి అందిచగలమన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇలాంటి వర్క్‌షాప్‌లతో సామాజిక విశ్లేషాత్మక విద్యకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆలోచనాత్మక విద్యాబోధన దిశగా సాగుతున్న ప్రయత్నానికి అన్ని విధాల సహకరిస్తామని ఆమె పేర్కొన్నారు.
Also Read:
ఒకటో తరగతి ప్రవేశాలపై కీలక నిర్ణయం! రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు!
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. నూతన విద్యావిధానం ప్రకారం విద్యార్థులకు పునాది దశలో అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో మొదటి మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, రెండేళ్లపాటు ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
APEdCET-2023 Notification: ఏపీ ఎడ్సెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
JEE Advanced 2023: జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
Sainik School Admissions: సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత