By: ABP Desam | Updated at : 23 Feb 2023 12:18 AM (IST)
Edited By: omeprakash
ఒకటో తరగతి ప్రవేశాలకు కనీస వయసు
ఇకపై ఎలాపడితే అలా పాఠశాలలో చేర్పించడానికి వీల్లేదు. 6 ఆరేళ్లు నిండితేగాని ఒకటో తరగతి చదవడానికి అర్హులు కాదు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది.
నూతన విద్యావిధానం ప్రకారం విద్యార్థులకు పునాది దశలో అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో మొదటి మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, రెండేళ్లపాటు ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. అందువల్ల అంగన్వాడీలు, ప్రభుత్వ/ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు, ఎన్‌జీవోలు నిర్వహించే ప్రీ స్కూల్ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యం.
కేంద్రం నిర్దేశించిన ఈ లక్ష్యం సాకారం కావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియ నిబంధనల్లో సవరణలు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేయడానికి వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సును రూపొందించి, అమలుచేయాలి. ఈ కోర్సును స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా రూపొందించి, డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌ల (డైట్) ద్వారా అమల్లో పెట్టాలి. ఈ కార్యక్రమాన్ని ఎస్‌సీఈఆర్‌టీ పర్యవేక్షణలో నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు సూచించింది.
Also Read:
APPSC: ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి(2024 జనవరి సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి జూన్ 3న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC- ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు, అర్హతలివే!
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జనవరి- 2024 టర్మ్ ఎనిమిదోవ తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. జనవరి 2024 నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఎడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, వైవా వోస్, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. జూన్ 3వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TSRJC CET - 2023 దరఖాస్తు గడువు పెంపు, పరీక్ష ఎప్పుడంటే?
Biometric Attendance: ఇక ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 'వేలిముద్ర' పడాల్సిందే! అక్రమార్కుల ఆగడాలకు చెక్!
TSEMR Admissions: ఏకలవ్య గురుకుల ప్రవేశ ప్రకటన విడుదల, పరీక్ష వివరాలు ఇలా!
PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!
AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!
నడ్డా తెలంగాణ పర్యటన రద్దు- 8న రానున్న ప్రధానమంత్రి
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు