అన్వేషించండి

Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE) లో జరగాల్సిన CBSE 12వ తరగతి పరీక్షలన్నీ రద్దయ్యాయి.

మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత విద్యార్థులకు ఒక ఊరట కలిగించే వార్త వచ్చింది. కేంద్ర మాధ్యమిక  విద్యా మండలి (CBSE) గల్ఫ్ ప్రాంతంలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థుల బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేసింది. ప్రవాస భారత కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలపై ఆధారపడే ఆయా దేశాల్లోని విద్యార్థులకు ఈ నిర్ణయం ఊరట కలిగిస్తుంది. 

CBSE విడుదల చేసిన నోటీసు ప్రకారం.. బహ్రెయిన్, ఇరాన్, ఒమన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లో జరగాల్సిన 12వ తరగతి పరీక్షలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ పరీక్షలు 2026 మార్చి 16 నుండి 2026 ఏప్రిల్ 10 వరకు జరగాల్సి ఉంది. మార్చి మొదటి వారంలో ఇప్పటికే వాయిదా పడిన పరీక్షలు కూడా తాజాగా పూర్తిగా రద్దు చేసినట్లు అవుతుంది. 

సిబిఎస్‌ఇ నిర్ణయం ఏంటి?

2026 మార్చి 1, 3, 5, 7, 9 తేదీల్లో వాయిదా పడిన పరీక్షలను ప్రస్తుతం రద్దు చేసినట్లు సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. ఈ దేశాల్లో చదువుతున్న విద్యార్థుల మూల్యాంకనం, ఫలితాల ప్రకటన ప్రక్రియను తర్వాత విడిగా వెల్లడిస్తామని బోర్డు తెలిపింది. పరీక్షల నియంత్రణాధికారి సంయమ్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘ఈ దేశాల్లోని 12వ తరగతి అభ్యర్థుల ఫలితాల ప్రకటన విధానం సరైన సమయంలో విడిగా తెలియజేస్తామని’ పేర్కొన్నారు.

ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావం, భద్రత లేదని ఆందోళనలు

మధ్య ప్రాచ్యం (పశ్చిమ ఆసియాలో)లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, అక్కడ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ తాత్కాలికంగా రద్దు చేసింది. గల్ఫ్ దేశాల్లో అనేక ప్రవాస భారత కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి పిల్లలు భారత విద్యా విధానంలో చదువుతున్నారు. ఊహించని పరిస్థితుల్లో ప్రయాణించడం, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం యుద్ధ సమయంలో సురక్షితం కానందున సీబీఎస్ఈ తీసుకున్న ఈ చొరవ విద్యార్థులకు, వారి కుటుంబాలకు ఊరటనిస్తోంది.

CISCE కూడా పరీక్షలు రద్దు

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) తీసుకున్న నిర్ణయం తర్వాత సిబిఎస్‌ఇ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లో భద్రతా పరిస్థితుల కారణంగా CISCE కూడా ఇప్పటికే ICSE, ISC పరీక్షలను రద్దు చేసింది. అక్కడ భారత విద్యా బోర్డులు విద్యార్థుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నాయని స్పష్టమవుతోంది.

భారత రాయబార కార్యాలయం నోటీసు విడుదల

గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అక్కడి భారత విద్యార్థుల చదువులపై పడుతోంది. దోహాలోని భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 7 దేశాల్లో నివసిస్తున్న 12వ తరగతి విద్యార్థుల అన్ని పరీక్షలను బోర్డు రద్దు చేసింది. మార్చి 16 నుండి 2026 ఏప్రిల్ 10 మధ్య జరగాల్సిన అన్ని పరీక్షలు ఇకపై ఉండవు. దీనికి ముందు ఇటీవల మార్చి 1, 3, 5, 7, 9 తేదీల సర్క్యులర్ల ద్వారా వాయిదా పడిన పరీక్షలు సైతం ఇప్పుడు పూర్తిగా రద్దు చేశారు. ఈ దేశాల్లోని 12వ తరగతి విద్యార్థుల ఫలితాలను ఎలా వెల్లడిస్తారనే దానిపై CBSE విడిగా సమాచారం ఇవ్వనుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget