TSRIMC Admissions: టీఎస్‌పీఎస్సీ- ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు, అర్హతలివే!
దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జనవరి- 2024 టర్మ్ ఎనిమిదోవ తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జనవరి- 2024 టర్మ్ ఎనిమిదోవ తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. జనవరి 2024 నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఎడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, వైవా వోస్, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. జూన్ 3వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు..
* ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు జనవరి- 2024 టర్మ్
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి జనవరి 2024 నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఎడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.01.2024 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. 02.01.2011 - 01.07.2012 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆర్ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌సర్వీస్ కమిషన్ చిరునామాకు పంపించాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా విధానం: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించినఅభ్యర్థులకు వైవా వోస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాత పరీక్ష, వైవా వోస్ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రం: హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు చివరి తేది: 15.04.2023.
పరీక్ష తేది: 03.06.2023.
Notification
Also Read:
GST Council: విద్యార్థులకు గుడ్ న్యూస్, తగ్గనున్న పరీక్షల ఫీజులు!
పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించే 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ'ని లెవీ పరిధి నుంచి మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. అలాగే పెన్సిళ్లు, షార్పనర్‌లపైనా లెవీని తగ్గించాలని జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో 49వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంటెక్ లేకుండానే 'పీహెచ్‌డీ'లోకి!
పీజీ లేకున్నా పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. బీటెక్ విద్యార్థులు కూడా రిసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బీటెక్ నుంచే పీహెచ్‌డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. అదికూడా ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. గతంలో బీటెక్ విద్యార్థులు పీహెచ్‌డీ చేయాలంటే.. ఎంటెక్ తప్పనిసరి. ఇప్పుడు వర్సిటీ నిర్ణయంతో అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..