GST Council: విద్యార్థులకు గుడ్ న్యూస్, తగ్గనున్న పరీక్షల ఫీజులు!
ప్రవేశ పరీక్ష ఫీజులపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించడం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం. ఈ మేరకు ఫీజులు తగ్గే అవకాశం ఉంది.
* లెవీ పరిధి నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మినహాయింపు
* పెన్సిల్, షార్పనర్‌లపై జీఎస్టీ తగ్గింపు
* 49వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించే 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ'ని లెవీ పరిధి నుంచి మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. అలాగే పెన్సిళ్లు, షార్పనర్‌లపైనా లెవీని తగ్గించాలని జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో 49వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
విద్యార్థులు దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం వివిధ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. వీటికి చెల్లించే ఫీజుపై ఇప్పటివరకు 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి వచ్చేది. తాజాగా ప్రవేశ పరీక్ష ఫీజులపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించడం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం. ఈ మేరకు ఫీజులు తగ్గే అవకాశం ఉంది.
అలాగే విద్యార్థులకు ఊరట కలిగించే మరో అంశం పెన్సిల్, షార్పనర్‌లపై విధించే జీఎస్టీని తగ్గించడం. వీటిపై ప్రస్తుతం జీఎస్టీ 18 శాతంగా ఉంది. దీన్ని 12 శాతానికి తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
జీఎస్టీ కౌన్సెల్ సమావేశం మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంటెక్ లేకుండానే 'పీహెచ్‌డీ'లోకి!
పీజీ లేకున్నా పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. బీటెక్ విద్యార్థులు కూడా రిసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బీటెక్ నుంచే పీహెచ్‌డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. అదికూడా ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. గతంలో బీటెక్ విద్యార్థులు పీహెచ్‌డీ చేయాలంటే.. ఎంటెక్ తప్పనిసరి. ఇప్పుడు వర్సిటీ నిర్ణయంతో అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ వెసులుబాటు కల్పించి, పీహెచ్‌డీ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. విద్యార్థులు 160 క్రెడిట్స్‌తో బీటెక్, మరో 18 క్రెడిట్స్‌ను పూర్తిచేస్తే ఆనర్స్ డిగ్రీని జారీ చేస్తారు. ఈ ఆనర్స్ డిగ్రీ పొందిన వారు ఎంటెక్, ఎంఫిల్ వంటి వాటితో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్స్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ.. వారం రోజుల ఆలస్యంగా ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్ రాసిన అభ్యర్ధుులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..