అన్వేషించండి

APPSC: ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి(2024 జనవరి సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి(2024 జనవరి సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి జూన్ 3న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

వివరాలు...

* రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌ - 8వ తరగతి ప్రవేశాలు

అర్హత: 01.01.2024 నాటికి గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఏడోతరగతి ఉత్తీర్ణులు/చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 01.01.2024 నాటికి 11.5 - 13 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించగానే ఆర్‌ఐఎంసీ దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్‌, పాత ప్రశ్నపత్రాలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపుతారు. విద్యార్థులు దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి ఏపీపీఎస్సీ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుతోపాటు అభ్యర్థులు మున్సిపల్‌ కార్పొరేషన్‌/గ్రామ పంచాయతీ జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌; నివాసం, కులం ధ్రువీకరణ పత్రాలు; బోనఫైడ్‌ సర్టిఫికెట్‌; ఆధార్‌ కార్డ్‌; విద్యార్థి 2 ఫొటోలు పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. లేదా సంబంధిత చిరునామాకు డిమాండ్ డ్రాఫ్ట్ పంపడం ద్వారా కూడా దరఖాస్తులు పొందవచ్చు. 

రాత పరీక్ష: మొత్తం మార్కులు 400. ఇంగ్లీష్‌ నుంచి 125 మార్కులకు, మేథమెటిక్స్‌ నుంచి 200 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు సమాధానాలను హిందీ లేదా ఆంగ్ల మాధ్యమంలో రాయవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి వైవా వోస్‌ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. ఇందులో ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితర అంశాలు పరీక్షిస్తారు. ఇందులో కూడా అర్హత సాధించినవారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రం: విజయవాడ.

డిడి పంపాల్సి చిరునామా:
The Commandant Rimc Dehradun, 
Drawee Branch, State Bank Of India, 
Tel Bhavan,. Dehradun, (Bank Code-01576),  Uttarakhand.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Assistant Secretary (Exams), 
APPSC Public, New Heads of Departments Building, 
Second Floor, Near RTA Office, Indira Gandhi Municipal Stadium, 
MG Road, Vijayawada- 520010, Andhra Pradesh.

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 15.04.2023.

➥ పరీక్ష తేది: 03.06.2023.

Notification

Website

Also Read:

ఏపీ పాలిసెట్‌ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్‌లలో ఇంజనీరింగ్‌, నాన్‌-ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించబడే పాలిసెట్‌ 2023 దరఖాస్తుల ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పాలీసెట్‌-2023 దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్‌ 30 కాగా, పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మే 10న నిర్వహించనున్నారు.  పదోతరగతి లేదా తత్సమాన విద్యను మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు పాలిసెట్‌ దరఖాస్తుకు అర్హులు.
పాలిసెట్ 2023 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మార్చిలో ఎంసెట్‌ నోటిఫికేషన్‌, పరీక్షల షెడ్యూలు ఇలా!
తెలంగాణలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశాలకు నిర్దేశించిన టీఎస్‌ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ మార్చి మొదటి వారంలో విడుదలకానుంది. అదే సమయంలో దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభంకానుంది. ఈ మేరకు జేఎన్‌టీయూహెచ్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ అమలు, కనీసం 45 శాతం మార్కులొచ్చి ఉండాలన్న నిబంధనలను సడలించడమా.. లేదా కొనసాగించడమా అన్న అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వ స్పందనను బట్టి వీటి అమలుపై స్పష్టత రానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget