News
News
X

Inter Colleges Affiliation: ఇంటర్ 'అఫిలియేషన్‌'కు 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ! ఏప్రిల్‌ 30 నాటికి కళాశాలల జాబితా!

2023-24 విద్యాసంవత్సరానికి గానూ కళాశాలల గుర్తింపుకు ఆయా కళాశాలల యాజమాన్యాలు జనవరి 25 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ ఈమేరకు ఉత్తర్వుల్లో తెలిపారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌(గుర్తింపు)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇంటర్‌ బోర్డు సోమవారం (జనవరి 23) విడుదల చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ కళాశాలల గుర్తింపుకు ఆయా కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ ఈమేరకు ఉత్తర్వుల్లో తెలిపారు. జనవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

మండల పరిధిలోని కాలేజీల షిఫ్టింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల అప్‌లోడింగ్‌కు ఫిబ్రవరి 21 వరకు గడువిచ్చారు. రూ.20వేల అపరాధ రుసుముతో మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఏప్రిల్‌ 30వ తేదీన వెల్లడిస్తామని పేర్కొన్నారు. సంబంధిత ధ్రువపత్రాలను పొందుపరిచి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అనుమతులు ఉన్న కళాశాలల జాబితా తెలియడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నష్టపోకుండా ఉంటారని బోర్డు తెలిపింది. ఈసారి కూడా ఒక మండలం నుంచి మరో మండలానికి, జిల్లాకు ఆయా కళాశాలలను తరలించడానికి (నాన్ లోకల్ షిఫ్టింగ్) దరఖాస్తులను స్వీకరించరు. మండల పరిధిలో మాత్రం తగిన ఫీజు చెల్లించి తరలించుకోవచ్చు.

జీఎస్టీ, హరిత నిధి చెల్లించాల్సిందే..
అనుబంధ గుర్తింపు ఇవ్వడం అనేది సేవ కిందకు వస్తుందని, అందువల్ల అఫిలియేషన్ ఫీజుపై జీఎస్టీ 18 శాతం చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ రకంగా రుసుంపై జీఎస్టీ విధించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా గత ఏడాది ఫిబ్రవరి 18న ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో 17 ప్రకారం ఆయా కళాశాలలు హరిత నిధిని చెల్లించాలని కూడా బోర్డు పేర్కొంది. ఆ ప్రకారం గ్రామ పంచాయతీల్లోని కళాశాలలు రూ.500, మున్సిపాలిటీ- రూ.వెయ్యి, కార్పొరేషన్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని కళాశాలలు రూ.1500 చొప్పున చెల్లించాలి. అయితే జీఎస్టీని విరమించుకోవాలని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీష్ డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్యార్థుల నుంచి హరిత నిధిని వసూలు చేస్తున్నారని, మళ్లీ కళాశాలలపై ఎందుకు విధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

Also Read:

గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి-2023లో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు. 
ప్రవేశ ప్రకటన, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి 'టీజీ యూజీసెట్‌'! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్-23 ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి. అర్హులైన విద్యార్థులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నవారు, 2022 మార్చిలో ఇంటర్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం కోసం క్లిక్ చేయండి.. 

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2023-2024 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నోటిఫికేన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 204 మైనార్టీ పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 107 బాలుర పాఠశాలలు ఉండగా, 97 బాలికల పాఠశాలలు ఉన్నాయి.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి.. 

విద్యార్థులకు గుడ్ న్యూస్, డ్యూయల్ డిగ్రీ విధివిధానాలు జారీ!
ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు జేఎన్‌టీయూ(JNTU) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విధివిధానాలను యూనివర్సిటీ జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. దీనిప్రకారం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించింది. అయితే కనీసం 30 శాతం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ఉంటేనే కళాశాలకు అనుమతి లభిస్తుంది. ఇంజినీరింగ్ 2,3,4 ఏడాది చదువుతున్న విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 24 Jan 2023 09:15 AM (IST) Tags: College Affiliation Education News in Telugu TSBIE Latest Education News Inter Colleges Inter Colleges Affiliation

సంబంధిత కథనాలు

TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!

TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!

సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్

సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్

Indian Navy B.Tech Course: నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత‌ హోదా ఉద్యోగం!

Indian Navy B.Tech Course: నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత‌ హోదా ఉద్యోగం!

KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?

KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?

TS Teachers Transfers: నేడు ఉపాధ్యాయ ఖాళీలు, సీనియారిటీ జాబితా వెల్లడి!

TS Teachers Transfers: నేడు ఉపాధ్యాయ ఖాళీలు, సీనియారిటీ జాబితా వెల్లడి!

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్