By: ABP Desam | Updated at : 23 Jan 2023 09:03 AM (IST)
Edited By: omeprakash
JNTU డ్యూయల్ డిగ్రీ కోర్సు
ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు జేఎన్‌టీయూ(JNTU) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విధివిధానాలను యూనివర్సిటీ జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. దీనిప్రకారం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించింది. అయితే కనీసం 30 శాతం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ఉంటేనే కళాశాలకు అనుమతి లభిస్తుంది. ఇంజినీరింగ్ 2,3,4 ఏడాది చదువుతున్న విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు. వీరందరూ బీటెక్‌తోపాటే బీబీఏ(డేటా అనలిటిక్స్) కోర్సు కూడా చదువుకోవచ్చు. వారంలో రెండురోజులు అంటే శని, ఆదివారాల్లో ప్రత్యక్ష బోధన, మిగతా రోజుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు.
మూడేళ్లకు రూ.1.80 లక్షల ఫీజు..
బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఏడాదికి రూ.60 వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మూడేళ్లకుగాను రూ.1.80 లక్షల ఫీజు చెల్లించాలి. అయితే ప్రత్యేక ఫీజు కింద ఏటా రూ.5,500, పరీక్ష ఫీజు రూ.1,910(సెమిస్టర్‌కు రూ.955) చెల్లించాల్సి ఉంటుంది.
ఆరేళ్లలో పూర్తి చేయకుంటే ప్రవేశం రద్దు..
కనీసం మూడేళ్లు.. గరిష్ఠంగా ఆరేళ్లలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈలోగా పూర్తి చేయకపోతే ప్రవేశం రద్దవుతుంది. కోర్సు చేస్తే 138 క్రెడిట్స్ సాధించేందుకు వీలుంటుంది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. కోర్సు విధివిధానాలు ఖరారు చేసి కళాశాలలకు పంపించామని, వచ్చే నెలలో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. సమయం వృథా కాకుండా బీటెక్ పూర్తయ్యేలోపే రెండు డిగ్రీలు చేతికి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీబీఏలో మరిన్ని కోర్సులు తీసుకురావాలనే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు.
Also Read: 24 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, హాజరుకానున్న 11 లక్షల మంది విద్యార్థులు!
యూజీసీ ఆదేశాల మేరకు..
యూజీసీ డ్యూయల్ డిగ్రీ కోర్సులకు అనుమతి తెలిపిన సంగతి తెలసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బీటెక్‌తో పాటు బీబీఏ కోర్సు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు బీబీఏ(డేటా అనలిటిక్స్)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నో ప్రయోజనాలు..
ఏకకాలంలో రెండు డిగ్రీలు చేసిన సామర్థ్యంతో కొలువుతోపాటు ప్యాకేజీ ఎక్కువగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో డ్యూయల్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు విధి విధానాలను ఈ ఏడాది ఏప్రిల్‌లో యూజీసీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఆలోచనల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచే వర్సిటీలో కోర్సును ప్రవేశపెట్టారు. బీటెక్‌లో సాధించే క్రెడిట్స్‌కు ఇవి అదనం కావడంతో ఉద్యోగాల సాధనలో ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కోర్సు ఇలా..
➥ ఇంజినీరింగ్ 2,3,4 ఏడాది చదువుతున్న విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు.
➥ బీబీఏ-డేటా అనలిటిక్స్ కోర్సు వ్యవధి మూడేళ్లు. దీనికి సంబంధించి సిలబస్ సిద్ధమైంది. కోర్సు బోధన వారానికి ఐదు రోజులు ఆన్‌లైన్, ఒకరోజు ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుంది. రాష్ట్రంలో జేఎన్‌టీయూ అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లోని ఇంజినీరింగ్ విద్యార్థులందరూ బీబీఏ కోర్సు చేయొచ్చు.
➥ ఈ విధానంలో క్రెడిట్ల బదలాయింపునకు వీలుంటుంది. ఒక కోర్సులో చదివిన సబ్జెక్టులకు సంబంధించిన క్రెడిట్లను మరో కోర్సుకు బదలాయించుకోవచ్చు. ఉదాహరణకు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో చదివిన సబ్జెక్టు బీబీఏ రెండో ఏడాదిలో మళ్లీ ఉందనుకోండి.. అప్పటికే ఇంజినీరింగ్‌లో చదివినందున.. బీబీఏలో చదవనక్కర్లేదు. ఇంజినీరింగ్‌లో వచ్చిన క్రెడిట్లు బీబీఏకు బదిలీ అవుతాయి.
Union Budget 2023: బడ్జెట్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత, భారీగా విద్యా సంస్థల ఏర్పాటు! బడ్జెట్ కేటాయింపు ఇలా!
Union Budget 2023: ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం, విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలు!
Union Budget 2023: పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0, దేశవ్యాప్తంగా స్కిల్ ఇండియా సెంటర్లు!
Mana Ooru Mana Badi: గంభీరావుపేట 'కేజీ టూ పీజీ' క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, సబితా!
నేడు ‘మన ఊరు – మన బడి పథకం’ పాఠశాలలు ప్రారంభం! తొలివిడతలో ఎన్నంటే?
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం