JEE Main 2023 Exam: 24 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, హాజరుకానున్న 11 లక్షల మంది విద్యార్థులు!
జనవరి 24, 25, 29, 30, 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 1న బీటెక్‌లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జనవరి 28న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
![JEE Main 2023 Exam: 24 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, హాజరుకానున్న 11 లక్షల మంది విద్యార్థులు! JEE Mains 2023 January session will be conducted from January 24 to February 1, down load Hall Tickets now JEE Main 2023 Exam: 24 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, హాజరుకానున్న 11 లక్షల మంది విద్యార్థులు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/22/29fea6fe6ea4582a255e32b3a2015d631674366901748522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుంచి మొదటి విడత జేఈఈ మెయిన్ ప్రారంభం కానుంది. దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 290 నగరాలు/పట్టణాలతో పాటు ఇతర దేశాల్లోని 18 నగరాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి.
జనవరి 24, 25, 29, 30, 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 1న బీటెక్‌లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ర్యాంకుతో ఎన్‌ఐటీల్లో చేరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష జనవరి 28న రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 24న పరీక్ష రాసేవారు హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు కోసం క్లిక్ చేయండి..
ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానుంది. మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసేవారి సంఖ్య లక్షన్నర వరకు ఉంటుంది.
తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపినవారిలో 2.50 లక్షల మంది మాత్రమే జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులవుతారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
పరీక్ష విధానం:
➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సులో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు.
➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.
➥ బీఈ, బీటెక్, బీఆర్క్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలివే..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.12.2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.01.2023. (9:00 P.M.)
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.01.2023. (11:50 P.M.)
➥ సిటీ ఎగ్జామినేషన్ వివరాల వెల్లడి: 2023, జనవరి రెండోవారంలో.
➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 2023, జనవరి మూడోవారంలో.
➥ పరీక్ష తేది: 2023, జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో.
➥ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల వెల్లడి: తర్వాత ప్రకటిస్తారు.
JEE (Main) – 2023 Schedule
JEE (Main) - 2023 Notification
Eligibility Criteria
Official Website
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)