By: ABP Desam | Updated at : 21 Jan 2023 04:26 PM (IST)
Edited By: omeprakash
జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డు
జేఈఈ మెయిన్ 2023 పరీక్షల మొదటి విడత అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 21న విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 28, 29,30, 31 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా జనవరి 28న మాత్రం కేవలం పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 24 నుంచి 31 తేదీ వరకు మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డుపై సెంటర్, తేదీ, షిష్ట్ వంటి వివరాలు ఉంటాయి.
JEE Main 2023 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..
➥ అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి - jeemain.nta.nic.in
➥ హోంపేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 సెషన్-1కు సంబంధించి లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
➥ జేఈఈ మెయిన్ అడ్మిట్‌కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది.
➥ ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్ తీసుకుని పెట్టుకోవాలి.
➥ కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
జేఈఈ తేదీలివే..
దేశంలోని ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. మెయిన్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌లో నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్‌టీఏ.. జనవరిలో తొలి విడత, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. తొలి సెషన్‌ను జనవరి 24, 25, 27, 29, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుండగా.. రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరుగుతుందని ఎన్‌టీఏ తెలిపింది.
పరీక్ష విధానం:
➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సులో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు.
➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.
➥ బీఈ, బీటెక్, బీఆర్క్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలివే..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.12.2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.01.2023. (9:00 P.M.)
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.01.2023. (11:50 P.M.)
➥ సిటీ ఎగ్జామినేషన్ వివరాల వెల్లడి: 2023, జనవరి రెండోవారంలో.
➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 2023, జనవరి మూడోవారంలో.
➥ పరీక్ష తేది: 2023, జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో.
➥ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల వెల్లడి: తర్వాత ప్రకటిస్తారు.
JEE (Main) – 2023 Schedule
JEE (Main) - 2023 Notification
Eligibility Criteria
Official Website
Also Read:
జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్'తో పరీక్షలకు అనుమతి!
ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్ ర్యాంక్
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
COOKIES_POLICY