AP SSC Exams: పదోతరగతి విద్యార్థులకు అలర్ట్, పరీక్షల్లో ఈ సారి కొత్త నిబంధనలు - పూర్తి వివరాలివే!
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారులు పరీక్షల షెడ్యూలును కూడా విడుదల చేశారు. మరోవైపు పదోతరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని వివరాలు నమోదుచేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు రాష్ట్రంలో 6,10,000 మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతారన్నారని ఆయన తెలిపారు.
విద్యార్థులకు నిబంధనలు..
➥ పరీక్ష కేంద్రాల్లోని సెల్‌ఫోన్తీ సుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ అబ్జర్వర్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు సైతం ఎగ్జామ్ సెంటర్లలోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు అధికారులు.
➥ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా సెల్‌ఫోన్లను ఎగ్జామ్ సెంటర్లలోకి తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగ్జామ్ సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు.
➥ ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. విద్యార్థులను కేంద్రాల్లోకి ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
➥ విద్యార్థులు ఆన్సర్లు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్‌ను అందించనున్నారు. ఇది నిండిన తర్వాత అడిగే మరో 12 పేజీల బుక్ లెట్ ను అందించనున్నారు.
➥ సైన్స్ పరీక్షకు 12 పేజీల బుక్ లెట్లు 2 ఇస్తారు. ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు ఒకటి, బయోలజీకి మరో బుక్‌లెట్ ఇవ్వనున్నారు.
పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 6 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది.
మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్స్ లింక్ కోసం క్లిక్ చేయండి..
పరీక్షల షెడ్యూలు ఇలా..
పరీక్ష తేదీ | పేపరు |
ఏప్రిల్ 3 | ఫస్ట్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 6 | సెకండ్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 8 | ఇంగ్లిష్ |
ఏప్రిల్ 10 | మ్యాథమెటిక్స్ |
ఏప్రిల్ 13 | సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) |
ఏప్రిల్ 15 | సోషల్ స్టడీస్ |
ఏప్రిల్ 17 | కాంపోజిట్ కోర్సు |
ఏప్రిల్ 18 | ఒకేషనల్ కోర్సు |
Also Read:
తెలంగాణ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇదే! క్వశ్చన్ పేపర్ ఇలా!
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పరీక్షల షెడ్యూలు, ప్రశ్నపత్రం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TS Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - కంట్రోల్ రూం నెంబర్ ఏర్పాటు, ఫ్రీ కౌన్సెలింగ్ సౌకర్యం
తెలంగాణలో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ లను, సంభందిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ లతో కలిసి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లు, సంభందిత అధికారులతో సోమవారం వీడియో సమావేశం నిర్వహించారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..