News
News
X

TS Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - కంట్రోల్ రూం నెంబర్ ఏర్పాటు, ఫ్రీ కౌన్సెలింగ్ సౌకర్యం

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ లను, సంభందిత అధికారులను ఆదేశించారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ లను, సంభందిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ లతో కలిసి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లు, సంభందిత అధికారులతో సోమవారం వీడియో సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ వార్షిక పరీక్షలను కట్టుదిటమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించాలని, అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసుకొని విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ లు నిరంతరం పర్యవేక్షిస్తూ పరీక్షలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం నెంబర్ ఏర్పాటు
ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేకంగా టెలీ మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను ఏర్పాటు చేసిందని, పరీక్షల సమయంలో ఆందోళనకు, టెన్షన్ కు గురయ్యే విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే మానసిక నిపుణులు, వైద్యులు ఉచిత కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, ఈ సదుపాయం పై విద్యార్థుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, అలాగే  రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, 040-24601010 నెంబర్ నందు సందేహాల నివృత్తి కోసం సంప్రదించాలని, ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థులకు వివిధ రకాల సేవలు అందించేందుకు TSBIE M సర్వీసెస్ మొబైల్ యాప్ వినియోగించుకోవాలని , పరీక్షా కేంద్రం వివరాలు ఆ యాప్ లో ఉంటాయని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ వార్షిక  పరీక్షల నిర్వహణకు గాను49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, తగిన ఏర్పాట్లను ముందస్తుగా చేసుకోడం జరిగిందని అన్నారు. జిల్లాలో 35142 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందులో మొదటి సంవత్సరంలో 18630 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరంలో 16512 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని అన్నారు. సందేహాల నివృత్తి కోసం జిల్లాలో 9502743435, 9966440775 నంబర్ల తో కంట్రోల్ రూం ఏర్పాటు చేసామని, పరీక్ష నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో ఏర్పాట్లను సమీక్షిస్తూ ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు.
ఉదయం 8 లోగా పరీక్షా కేంద్రాలకు..
విద్యార్థులు దూర ప్రాంతాల నుండి ఆర్టీసి బస్సులలో ఉదయం 8 గంటలలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా, పరీక్ష ముగిసిన వెంటనే తిరిగి వెళ్ళే విధంగా బస్సులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అధికారులను  ఆదేశించారు.  పరీక్షా హాలులో విద్యార్థిని, విద్యార్థులను విడివిడిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని, ఇందుకు గాను ఇంటర్ అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని, ఆరోగ్య సంబంధమైన సమస్యలు విద్యార్థులకు తలెత్తకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని మందులతో అందుబాటులో ఉంచాలని, పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని, త్రాగునీటి వసతి, పరిశుభ్రత నిర్వహణ గురించి మున్సిపల్ కమిషనర్లు, డి.పి.ఓ. చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
ప్రశ్నాపత్రాలను పోలీసు బందొబస్తు ద్వారా పరీక్షా కేంద్రాలకు, పరీక్ష ముగిసిన తర్వాత పోస్టల్ శాఖకు జవాబు పత్రాలను సీల్ చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో తరలించాలని సూచించారు. పరీక్షలు  సజావుగా జరిగే విధంగా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించాలని, జిల్లాలోని ప్రతి  పరీక్షా కేంద్రంలో సీసీ  కెమెరాలు పని తీరును ముందస్తుగా పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.

హాల్ టికెట్లను కళాశాలల ద్వారా డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలని, అలాగే ఆన్ లైన్ ద్వారా వెబ్ సైట్ లో విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచడం జరుగుతుందని, హాల్ టికెట్ డౌన్లోడ్ లో సమస్య ఉంటే జిల్లా యంత్రాంగానికి సంప్రదించాలని, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సందేహాలను నివృత్తి కోసం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్ 040-24601010, 040- 24655027 లను ఏర్పాటు చేసిందని ఈ  సౌకర్యం ను విద్యార్థులు వినియోగించు కొనే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
ఈ  సమావేశం లో..జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోపాల్, డిఎంహెచ్ వో సాంబశివరావు, డిపివో జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.



Published at : 13 Mar 2023 04:34 PM (IST) Tags: TS Inter Exams Inter Exams Telangana Sabitha Indra Reddy TS Intermediate Exams Schedule

సంబంధిత కథనాలు

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Komatireddy Venkat Reddy: అన్ని విషయాలూ మీడియాతో చెప్పుకోలేం - ప్రధానితో భేటీ తర్వాత ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy: అన్ని విషయాలూ మీడియాతో చెప్పుకోలేం - ప్రధానితో భేటీ తర్వాత ఎంపీ కోమటిరెడ్డి

Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!

Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!

టాప్ స్టోరీస్

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !