By: ABP Desam | Updated at : 29 Dec 2022 10:00 AM (IST)
Edited By: omeprakash
తెలంగాణ పదోతరగతి పరీక్షల తేదీలు
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.
ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పరీక్ష తేదీ | పేపరు |
ఏప్రిల్ 3 | ఫస్ట్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 4 | సెకండ్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 6 | ఇంగ్లిష్ |
ఏప్రిల్ 8 | మ్యాథమెటిక్స్ |
ఏప్రిల్ 10 | సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) |
ఏప్రిల్ 11 | సోషల్ |
ఏప్రిల్ 12 | ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు |
ఏప్రిల్ 13 | ఓరియంటెల్ పేపర్-2 |
క్వశ్చన్ పేపర్ స్వరూపం ఇలా..
➥ పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మాటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. సైన్స్‌పేపర్‌లో ఫిజిక్స్, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది. ఈసారి 80 మార్కుల ప్రశ్నపత్రంలో 30 మార్కులకు వ్యాసరూప ప్రశ్నలు ఉండనున్నాయి. ఒక్కో దానికి 5 మార్కుల చొప్పున.. ఆరు ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నలో 'ఎ' లేదా 'బి' అని రెండు ప్రశ్నలుంటాయి. విద్యార్థులు ఆ రెండింటిలో ఏదో ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది. గతంలో మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు రెండు పేపర్లకు కలిపి 10 మార్కులకే ఉండేవి. ఈసారి వాటిని 20 మార్కులకు పెంచారు.
➥ ఈ విద్యా సంవత్సరం నుంచే 9, 10 తరగతుల వారికి పరీక్షల్లో పలు సంస్కరణలు తెస్తూ ప్రభుత్వం బుధవారం జీవో 33 జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే ప్రకటించినట్లు పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు మాత్రమే వార్షిక పరీక్షల్లో ఉండనున్నాయి. ఇక 9వ తరగతికి ఎస్‌ఏ-1, ఎస్‌ఏ-2 పరీక్షలకు ఈ విధానం వర్తించనుంది. ఇప్పటికే 9, 10 తరగతుల వారికి ఎస్ఏ-1 పరీక్షలు పూర్తవడంతో పదో తరగతిలో వార్షిక పరీక్షలకు 6 పేపర్ల విధానం అమలుకానుంది.
➥ ఇప్పటివరకు నాలుగు ఫార్మాటివ్ ఎసెస్‌మెంట్(ఎఫ్‌ఏ) పరీక్షలకు 20 మార్కులు, ఒక్కో పేపర్‌కు 40 మార్కులు చొప్పున రెండు పేపర్లకు కలిపి 80 మార్కులకు పరీక్షలు ఉండేవి. గతంలో మాదిరిగానే ఎఫ్‌ఏలకు ఈసారి కూడా 20 మార్కులే ఉంటాయి. అయితే సైన్స్‌లో రెండు భాగాలు ఉన్నందున భౌతికశాస్త్రానికి 10 మార్కులు, జీవశాస్త్రానికి 10 మార్కులు కేటాయిస్తారు. ఈసారి ఆరు పేపర్లు అయినందున ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కుల పరీక్ష ఉంటుంది.
సైన్స్ ప్రశ్నపత్రం ఇలా..
సైన్స్ ప్రశ్నపత్రంలో భౌతికశాస్త్రం, రెండోది జీవశాస్త్రం రెండు భాగాలుంటాయి. ఒక్కో భాగానికి 40 మార్కులు. వేర్వేరు ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు ఇస్తారు. భౌతికశాస్త్రాన్ని ఒక జవాబుపత్రంలో, జీవ శాస్త్రాన్ని మరో జవాబుపత్రంలో రాయాల్సి ఉంటుంది. మొదట భౌతికశాస్త్రం పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష గంటన్నరపాటు ఉంటుంది. ఇది ముగిసిన తర్వాత జీవశాస్త్రం ప్రశ్నపత్రం ఇస్తారు. మొదటి భాగం జవాబు పత్రాలను తీసుకోవడం, రెండోది ఇవ్వడం కోసం ఈ సబ్జెక్టుకు 20 నిమిషాల సమయం అదనంగా ఇచ్చారు.
మొత్తం ఎన్ని మార్కులు...
ఎప్పటిలాగే మొత్తం 600 మార్కులకే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పరీక్ష పేపర్ల సంఖ్య మాత్రమే మారనుంది. ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కుల చొప్పున మొత్తం 480 మార్కులకు ప్రధాన పరీక్ష, ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కుల చొప్పున 120 మార్కులకు ఫార్మాటివ్ అసెస్‌మెంట్-1 ఉంటాయి. రెండు కలిపి 600 మార్కులు ఉంటాయి.
Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!
CBSE Hall Tickets: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
NEET PG 2023: ఎంబీబీఎస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్, నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పెంపు
AP RCET: ఫిబ్రవరి 9 నుంచి 'ఏపీఆర్‌సెట్' రెండో విడత కౌన్సెలింగ్! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
NEET PG 2023: నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్లో మార్పు - తప్పుడు వార్తల్ని నమ్మొద్దంటూ కేంద్రం క్లారిటీ!
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!