అన్వేషించండి

ఏపీ వ్యాయామ కళాశాలల్లో కోర్సుల ఫీజులు ఖరారు, ఏ కోర్సుకు ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్, అన్‌–ఎయిడెడ్‌ వ్యాయామ కళాశాలల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సుల ఫీజులు ఖరారయ్యాయి 2023–26 విద్యా సంవ్సతరానికి ఫీజులను ప్రభుత్వం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్, అన్‌–ఎయిడెడ్‌ వ్యాయామ కళాశాలల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సుల ఫీజులు ఖరారయ్యాయి. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిఫారసుల మేరకు 2023–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ప్రభుత్వం ప్రకటించింది.

దీనిప్రకారం కన్వీనర్‌ కోటా కింద రెండేళ్ల కోర్సుల్లో భాగంగా డిప్లొమా(డీపీఈడీ) కోర్సు ఫీజును రూ.14,000 నుంచి రూ.16,000 వేలు, బ్యాచిలర్ డిగ్రీ (బీపీఈడీ) కోర్సుకు రూ.15,000 నుంచి రూ.24,500; అదేవిధంగా మాస్టర్స్‌ డిగ్రీ (ఎంపీఈడీ) కోర్సు ఫీజును రూ.25,000 నుంచి రూ.35,000 మధ్య ఆయా కళాశాలల్లోని వసతులు, విద్యా బోధనను బట్టి ఫీజులను నిర్ణయించింది

ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోని ఒక కళాశాలతో పాటు, గత అడ్మిషన్లలో 25% కంటే తక్కువ నమోదైన 5 కళాశాలలకు అడ్మిషన్లను 2023–26 విద్యా సంవత్సరానికి బ్లాక్‌ చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు.

ALSO READ:

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ఫీజులు ఖరారు, ఫీజులు ఎంతమేర పెరిగాయంటే?
ఏపీలో 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య, డెంటల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జులై 25న ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఫీజుల అమలు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022–23లో అమలైన ఫీజులను 10 శాతం పెంచుతూ కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 

➥ ఎంబీబీఎస్‌ కన్వనర్‌ కోటా ఫీజును రూ.16,500గా నిర్ణయించారు. బి-కేటగిరికి రూ.13.20 లక్షలు, సి-కేటగిరి (ఎన్‌ఆర్‌ఐ కోటా)కు రూ.39.60 లక్షలుగా ఫీజును నిర్ణయించారు. 

➥ బీడీఎస్‌ కన్వనర్‌ కోటా ఫీజును రూ.14.300. బి-కేటగిరీకి రూ.4.40 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ (సి-కేటగిరి) కోటాకి రూ.13.20 లక్షలు చొప్పున ఫీజు ఖరారు చేశారు.

2020లో ఖరారు చేసిన ఫీజుల ప్రకారం 2022–23 విద్యా సంవత్సరం వరకు ప్రవేశాలు చేపట్టారు. నీట్‌ యూజీ–2023లో ఏపీలో 42,836 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కో­ర్సు­ల్లో ప్రవేశాలకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య వర్సిటీ ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చింది. నీట్‌ యూజీ అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకుంటున్నారు. 

NIMS: నిమ్స్‌‌లో ఎంఎస్సీ ప్రోగ్రామ్‌, ప్రవేశ వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 2023 విద్యాసంవత్సరానికి జెనెటిక్ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ(లైఫ్ సైన్సెస్)/ బీఈ, బీటెక్‌ (బయోటెక్నాలజీ/ జెనెటిక్ ఇంజినీరింగ్/ బయోమెడికల్ ఇంజినీరింగ్/ బయోలాజికల్ సైన్సెస్) లేదా ఎంబీబీఎస్‌/ బీడీఎస్ ఉత్తీర్ణత దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆగస్టు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 09 వరకు దరఖాస్తు హార్డ్ కాపీలు సమర్పించవచ్చు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

నల్సార్‌ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Embed widget