అన్వేషించండి

NALSAR: నల్సార్‌ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రోగ్రామ్ వివరాలు..

ఎంఏ: ఏవియేషన్ లా అండ్‌ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్ లా, స్పేస్ అండ్‌ టెలికమ్యూనికేషన్ లా, మారిటైమ్ లా, క్రిమినల్ లా & ఫోరెన్సిక్ సైన్స్, ఇంటర్నేషనల్ టాక్సెషన్, ఎనిమల్ ప్రొటెక్షన్ లా, కార్పొరేట్ లా.

వ్యవధి: 2-సంవత్సరాలు.

అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా: పేటెంట్ లా, సైబర్ లా, మీడియా లా, ఇంటర్నేషనల్‌ హ్యూమనిటేరియన్‌ లా, ఆల్టర్నేటివ్‌ డిస్‌ప్యూట్‌ రెజల్యూషన్‌, ఫ్యామిలీ డిస్‌ప్యూట్‌ రెజల్యూషన్‌, డ్రాఫ్టింగ్, నెగోషియేషన్ &ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్స్, కార్పొరేట్ టాక్సేషన్‌, లేబర్ లా&ఎంప్లాయ్ మేనేజ్‌మెంట్, ఏవియేషన్ లా అండ్‌ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, GIS & రిమోట్ సెన్సింగ్ లా, మారిటైమ్ లా, క్రిమినల్ లా & ఫోరెన్సిక్ సైన్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్ & లేగిస్లేషన్స్, ఎనిమల్ ప్రొటెక్షన్ లా, సైబర్ సెక్యూరిటీ & డేటా ప్రొటెక్షన్ లా, కార్పొరేట్ లా.

వ్యవధి: సంవత్సరం.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.08.2023.

Notification

Website

ALSO READ:

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం, మాతృభాషలో విద్యాబోధన - పాఠశాలలకు అనుమతి!
మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతించింది. ఒకవైపు ఏపీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్రీయ విద్యాలయాల్లో, ఇతర సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో మాతృభాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని నిర్ణయించడం విశేషం. ఇందుకు అనుగుణంగా కొత్త పాఠ్యపుస్తకాలను 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందించాలని ఎన్‌సీఈఆర్‌టీని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలకు సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో హిందీలో బోధిస్తున్నారు. సీబీఎస్‌ఈ తాజా నిర్ణయంతో పాఠశాలలు ఇకపై తమకు నచ్చిన భారతీయ భాషల్లో విద్యాబోధన చేసేందుకు వీలవుతుంది. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో భిన్న భాషల్లో విద్యాభోధన అమలుచేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను అన్వేషించాలని, నిపుణులతో సంప్రదింపులు జరుపాలని, ఇతర పాఠశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ జోసెఫ్‌ ఇమ్మానుయేల్‌ పాఠశాలలకు సూచించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

డా.వైఎస్సార్‌ హెల్త్‌ వర్సిటీ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. నీట్‌(యూజీ)-2023 అర్హత సాధించిన అభ్యర్థులు జులై 26న సాయంత్రం 6 గంటల్లోగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య క్రమాన్ని విజయవాడలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాయగా 42,836 మంది అర్హత సాధించారు. వీరంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
నోటిఫికేషన్, కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి.

జులై 24 నుంచి ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తికాగా, జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. మొద‌టి విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థుల‌ు జులై 23లోగా సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం జులై 24 నుంచి రెండో విడత  కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. విద్యార్థులు జులై 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించి, స్లాట్ బుకింగ్‌ చేసుకోవాలి. వీరికి జులై 26న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. జులై 24 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. జులై 27న సీట్లను ఫ్రీజ్‌ చేయనున్నారు. ఇక జులై 31న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌రిపోర్ట్‌ చేయడంతో పాటు, ట్యూషన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget