అన్వేషించండి

CBSE: సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం, మాతృభాషలో విద్యాబోధన - పాఠశాలలకు అనుమతి!

మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతించింది.

మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతించింది. ఒకవైపు ఏపీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్రీయ విద్యాలయాల్లో, ఇతర సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో మాతృభాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని నిర్ణయించడం విశేషం. 

ఇందుకు అనుగుణంగా కొత్త పాఠ్యపుస్తకాలను 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందించాలని ఎన్‌సీఈఆర్‌టీని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలకు సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో హిందీలో బోధిస్తున్నారు. సీబీఎస్‌ఈ తాజా నిర్ణయంతో పాఠశాలలు ఇకపై తమకు నచ్చిన భారతీయ భాషల్లో విద్యాబోధన చేసేందుకు వీలవుతుంది. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో భిన్న భాషల్లో విద్యాభోధన అమలుచేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను అన్వేషించాలని, నిపుణులతో సంప్రదింపులు జరుపాలని, ఇతర పాఠశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ జోసెఫ్‌ ఇమ్మానుయేల్‌ పాఠశాలలకు సూచించారు. 

2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. నూతన విద్యా విధానానికి ఈ నెలతో మూడేళ్లు పూర్తవుతున్నాయి. దీన్ని పురస్కరించుకుని త్వరలోనే కొత్త కరిక్యులమ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలు తమ మాతృభాషపై ప్రత్యేకదృష్టి సారించడంతోపాటు ఇతర భాషలను తెలుసుకుంటే, బహు భాషావాదం చిన్నారుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుందని జాతీయ విద్యావిధానం-2020 కూడా బలంగా చెబుతోంది. కనీసం 5వ తరగతి వరకైనా ఈ విధానం అనుసరించాలని, 8వ తరగతి.. ఆ తర్వాత కూడా ఇదే విధానం మేలని నిర్దేశిస్తోంది. 

బహుభాషా విద్యావిధానం అమలుకు, బోధనా భాషగా మాతృభాష వాడకానికి ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. భిన్న భాషల్లో బోధించే సామర్థ్యమున్న నిపుణులైన టీచర్లు దొరకడం, నాణ్యమైన బహుభాషా పాఠ్యపుస్తకాల లభ్యత కష్టమవుతోంది. ఈ సవాళ్ల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భారతీయ భాషల ద్వారానే విద్యాబోధన కొనసాగించేందుకు కేంద్ర విద్యాశాఖ పలు చర్యలు తీసుకొంది. ఆ సంస్థ వెంటనే ఈ పనిని ప్రారంభించినందున వచ్చే సీజను నుంచి పిల్లలకు 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు.. ఉన్నత విద్యారంగంలోనూ భారతీయ భాషల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ పని మొదలైంది. ఇంగ్లిష్‌ మాధ్యమానికి అదనంగా భారతీయ భాషల్లో బోధన, అభ్యాస ప్రక్రియ కొనసాగించడానికి, పరీక్షలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. 

ALSO READ:

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రారంభించిన కేంద్రం, 9 బాషల్లో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ!
కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌కు సంబంధించి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ ఇండియా, జీయూవీఐ మధ్య పరస్పర సహకారంతో ఈ కార్యక్రమానికి రూపొందించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ, హిందీతోపాటు ఇంగ్లిష్‌లో ఈ కోర్సును అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కోర్సును ప్రారంభిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే బోధన ఉంటుంది. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Yanamala Rama Krishnudu: టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
Rohit Kohli Bonding: రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ  కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్
రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. వీడియోలు వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Yanamala Rama Krishnudu: టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
Rohit Kohli Bonding: రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ  కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్
రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. వీడియోలు వైరల్
Gopichand 33 Movie: 'ఘాజీ' మూవీ డైరెక్టర్‌తో గోపీచంద్ కొత్త  సినిమా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్.. పవర్ ఫుల్ పీరియాడిక్ డ్రామాగా..
'ఘాజీ' మూవీ డైరెక్టర్‌తో గోపీచంద్ కొత్త సినిమా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్.. పవర్ ఫుల్ పీరియాడిక్ డ్రామాగా..
Tax Relief: దిగిరానున్న ధరలు, తగ్గనున్న పన్ను మోతలు! - తీపికబురు చెప్పిన నిర్మలమ్మ
దిగిరానున్న ధరలు, తగ్గనున్న పన్ను మోతలు! - తీపికబురు చెప్పిన నిర్మలమ్మ
HomeTown Web Series Teaser: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ - ఈ టౌన్‌లో లవ్, ఫ్రెండ్‌‍షిప్ అన్నీ ఉంటాయ్.. ఆకట్టుకుంటోన్న టీజర్!
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ - 100కి 116 మార్కులెలా వచ్చాయ్‌రా.. నవ్వులు పూయిస్తోన్న టీజర్!
Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
Embed widget