అన్వేషించండి

AI-for-India 2.0: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రారంభించిన కేంద్రం, 9 బాషల్లో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ!

కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది.

కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌కు సంబంధించి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ ఇండియా, జీయూవీఐ మధ్య పరస్పర సహకారంతో ఈ కార్యక్రమానికి రూపొందించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ, హిందీతోపాటు ఇంగ్లిష్‌లో ఈ కోర్సును అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కోర్సును ప్రారంభిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే బోధన ఉంటుంది. 

ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు 'నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీవీఈటీ)', ఐఐటీ మద్రాస్ గుర్తింపు కూడా దక్కించుకుంది. ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీ జీయూవీ.. పర్సనలైజ్డ్ లెర్నింగ్ సొల్యూషన్స్‌ విభాగాల్లో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ వివిధ ప్రాంతీయ భాషల్లో సాంకేతిక నైపుణ్యాలను బోధించడం, ఆన్‌లైన్ లెర్నింగ్, అప్‌స్కిల్లింగ్, రిక్రూట్‌మెంట్ అవకాశాల వంటి సేవలను అందిస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ భాషాల్లో టెక్ స్కిల్స్ బోధించడంలో ముందంజలో ఉంది.

మీరూ చేరవచ్చు..
గతంలో ప్రోగ్రామింగ్ చేయకపోయినా, బేసిక్ సింటాక్స్ తెలిసినా లేదా పైథాన్ అధునాతన ఫీచర్ల గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సు మీకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్‌ల ఓవర్ వ్యూను అందిస్తోంది. ఈ కోర్సు ద్వారా కంపెనీలు కోరుకునే పైథాన్ ప్రోగ్రామింగ్, ఏఐ నైపుణ్యాలను పొందేందుకు అవకాశం కలుగుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక విద్యను ప్రతి ఒక్కరికి అందించడానికి ముఖ్యంగా.. గ్రామీణ యువతలో సాధికారత కల్పించే లక్ష్యంతో ఏఐ-ఫర్-ఇండియా 2.0 కోర్సుకు రూపకల్పన చేశారు. 

దరఖాస్తు ఇలా..
ఈ ఉచిత ఏఐ కోర్సులో ప్రవేశాలు కోరేవారు GUVI అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుది. సైనప్ చేసే సమయంలో మీకు జావా, కోడింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇతర విషయాలపై ఏమైనా అవగాహన ఉందా అని అడుగుతారు. కానీ ఇవేమీ రాకపోయినా ఏఐ ప్రాగ్రామింగ్ నాలెడ్జ్ కావాలనుకునే వారు కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ https://www.guvi.in లేదా https://www.guvi.in/ai-for-india/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అవరోధాలను ఛేదించడం ముఖ్యం - కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 
భార‌తీయ ప్రాంతీయ భాష‌లలో సాంకేతిక కోర్సుల‌ను అందించాల్సిన ఆవశ్యకతను కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నొక్కి చెప్పారు. సాంకేతిక విద్యలో భాషాపరమైన అవరోధాలను ఛేదించడం అత్యంత ముఖ్యమని, ఈ కార్యక్రమం దేశంలోని యువతను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని భవిష్యత్తుకు కీలకమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. కాగా భవిష్యత్తు మొత్తం ఏఐ దే అని ఇప్పటికే విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ ఈ రంగంలో పెట్టుబడులు పెంచుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఇటీవలే ఏఐ స్టార్టప్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బండికి ఇది లేకపోతే భారీ జరిమానా, మీ జీతంలో చాలాభాగం కోల్పోతారు!
Embed widget