NIMS: నిమ్స్ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 2023 విద్యాసంవత్సరానికి జెనెటిక్ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 2023 విద్యాసంవత్సరానికి జెనెటిక్ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ(లైఫ్ సైన్సెస్)/ బీఈ, బీటెక్ (బయోటెక్నాలజీ/ జెనెటిక్ ఇంజినీరింగ్/ బయోమెడికల్ ఇంజినీరింగ్/ బయోలాజికల్ సైన్సెస్) లేదా ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణత దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆగస్టు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 09 వరకు దరఖాస్తు హార్డ్ కాపీలు సమర్పించవచ్చు.
ప్రోగ్రామ్ వివరాలు..
ఎంఎస్సీ (జెనెటిక్ కౌన్సెలింగ్) ప్రోగ్రామ్: 02
కోర్సు వ్యవధి: రెండు సంవత్సరాలు.
అర్హత: బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ బీఈ, బీటెక్ (బయోటెక్నాలజీ/ జెనెటిక్ ఇంజినీరింగ్/ బయోమెడికల్ ఇంజినీరింగ్/ బయోలాజికల్ సైన్సెస్) లేదా ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.08.2023.
➥ దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ: 09.08.2023.
Notification
ALSO READ:
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం, మాతృభాషలో విద్యాబోధన - పాఠశాలలకు అనుమతి!
మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతించింది. ఒకవైపు ఏపీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్రీయ విద్యాలయాల్లో, ఇతర సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో మాతృభాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని నిర్ణయించడం విశేషం. ఇందుకు అనుగుణంగా కొత్త పాఠ్యపుస్తకాలను 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందించాలని ఎన్‌సీఈఆర్‌టీని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో హిందీలో బోధిస్తున్నారు. సీబీఎస్‌ఈ తాజా నిర్ణయంతో పాఠశాలలు ఇకపై తమకు నచ్చిన భారతీయ భాషల్లో విద్యాబోధన చేసేందుకు వీలవుతుంది. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో భిన్న భాషల్లో విద్యాభోధన అమలుచేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను అన్వేషించాలని, నిపుణులతో సంప్రదింపులు జరుపాలని, ఇతర పాఠశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్ జోసెఫ్ ఇమ్మానుయేల్ పాఠశాలలకు సూచించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
డా.వైఎస్సార్ హెల్త్ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. నీట్(యూజీ)-2023 అర్హత సాధించిన అభ్యర్థులు జులై 26న సాయంత్రం 6 గంటల్లోగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య క్రమాన్ని విజయవాడలోని వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాయగా 42,836 మంది అర్హత సాధించారు. వీరంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
నోటిఫికేషన్, కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial