By: ABP Desam | Updated at : 07 Dec 2021 06:52 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
టీచర్ రాజేష్
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఓ ప్రైవేట్ స్కూల్ లో కీచక టీచర్ కి విద్యార్థిని బంధువులు దేహశుద్ధి చేశారు. 10వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు ఈపిచర్ల. రాజేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేరు సమయంలో ఇంటి వెళ్లి లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. వేధింపులకు గురైన విద్యార్థిని బంధువులు స్కూల్ కి వచ్చి రాజేష్ కు దేహశుద్ధి చేశారు. గతంలోనూ రాజేష్ విద్యార్థినులపై ఇదే తరహాలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజేష్ పై చర్యతీసుకోవాలని బాధిత బాలిక తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్ ను ఉద్యోగం నుంచి తీసివేసినట్లు స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. గతంలో ఇదే స్కూల్ కు చెందిన బస్సు క్లినర్ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
Also Read: వీఆర్ఏ గౌతమ్ మృతి.. ఇసుక మాఫియాపై ఫ్యామిలీ అనుమానం
సహోద్యోగిపై లైంగిక వేధింపులు
హైదరాబాద్ జీహెచ్ఎంసీ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోన్న మహిళపై సహోద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. స్టాటిస్టికల్ ఆఫీసర్ గా పనిచేస్తోన్న శ్రీనివాస్ మహిళను లైంగికంగా వేధించాడని సదరు మహిళ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని మేయర్ ఆదేశించారు. మేయర్ ఆదేశాలతో దీనిపై విచారణ జరుగుతుంది. చార్మినార్ జోన్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోన్న మహిళా ఉద్యోగిని ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు చీఫ్ మెడికల్ ఆఫీసర్, కొందరు యూనియన్ నేతలకు ఫిర్యాదు చేసింది. కానీ సమస్య పరిష్కారం కాకపోయే సరికి ఆమె సోమవారం నేరుగా మేయర్ విజయలక్ష్మిని కలిసి తన బాధను చెప్పుకున్నారు. దీంతో మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్ చేసి మాతృశాఖకు సరెండర్ చేయాలని ఆదేశించారు.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Dead Body In Manhole: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసిన పూజారి- హైదరాబాద్‌లో దారుణం
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు
Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ
టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్
Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలు భారత్‌లోనే, 3 దశాబ్దాల తరవాత సర్ప్రైజ్