ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు
జాతీయ మానవహక్కుల కమిషన్ ముసుగుగులో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి జైలుకు పంపించారు వరంగల్ పోలీసులు.
వరంగల్ : జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) ముసుగుగులో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి జైలుకు పంపించారు వరంగల్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. తొర్రూరు మండలానికి చెందిన తాటికాయల క్రాంతి కుమార్ మీడియాలో చేస్తున్నాడు. బుంగ జ్యోతి రమణ, హ్యూమన్ రైట్ రాష్ట్ర గవర్నర్ అనే మహిళతో కలిసి R/o H. No కొంత మంది ముఠాగా ఏర్పడి చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఓ రోజు సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో పెద్దమ్మ గడ్డలో భీమా భీమయ్య అనుమానస్పదంగా చనిపోయాడని బంధువులు ధర్నా చేస్తుండగా పోలీసులు శవాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి పంపించే క్రమంలో జన్ను రాజు అనే వ్యక్తి హనుమకొండ ఎస్సై డి. రాజు కు తన మొబైల్ ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేసి హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్ మాట్లాడతాడని లౌడ్ స్పీకర్ పెట్టి ఇవ్వగా.. నిందితుడు క్రాంతి ఎస్సైని ఇష్టం వచ్చినట్లు దూషించి, బెదిరించాడు. ఈ విషయమై ఎస్సై రాజు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా క్రాంతి కుమార్ నేర స్వభావము కలిగి ఉండి గతంలో కూడా చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో Cr. No. 410/2021 U/s 420, 354-d, 384, 509, 506 IPC, (చీటింగ్, మహిళలను తనతో గడపమని వెంట పడడం) బోయినపల్లి పోలీస్ స్టేషన్లో Cr. No. 466/2019 U/s 376(1), 385, 354-సి, 323 506 IPC(మానభంగం ) కేసులు నమోదయ్యాయి.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఫోన్ లు మాట్లాడి రికార్డులు
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పేరు చెప్పి క్రాంతి కుమార్, బుంగ జ్యోతి, రమణ, రవి సంజయ్ అడ్వకేట్ లు గ్యాంగ్ గా మారి నేషనల్ హ్యూమన్ రైట్ మెంబెర్స్ అని, జర్నలిస్ట్ లము అని, గిన్నీస్ బుక్ వరల్డ్ కో ఆర్డినేట్లం అని, హై కోర్ట్ అడ్వాకెట్ లము అని, సీనియర్ IAS, IPS అధికారులకు ఫోన్లు చేసి భూతులు మాట్లాడుతూ వాయిస్ రికార్డులను, పోస్ట్ చేస్తూ బెదిరించారు. గవర్నర్, సెక్రెటరీ శర్మ పేరు చెపుతూ భూముల తగాదాలలో తల దూర్చి బెదిరించే వారు. ఈ విషయంలో అడ్వొకేట్ రవి సంజయ్ పై ఇబ్రహీం పట్నం PS లో, CCS హైదరాబాద్‌లో, రాజపేటలో, మేడ్చల్ పీఎస్ లో, చిలకలగూడ పీఎస్ లో (పోలీసు విధులను అడ్డుకోవడం, వారి పైకి కుక్కలను ఉసి గొలిపి గాయపరచడం) మొదలైన కేసులు నమోదయ్యాయి. వీరంతా కలిసి భూతగాదాల సెటిల్మెంట్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని విచారణలో తేలింది.
పోలీసులను బూతులు తిట్టి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ, మహిళలకు అసభ్యకరంగా పంపించిన మెసేజ్లు, మత్తుమందు ఏ విధంగా వాడాలో తెలియజేసే విషయాలు చాలామంది మహిళలకు పంపిన క్రాంతి మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. వాస్తవంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ వీరికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైనా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసినట్లు అయితే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోబడతాయి.
నిందితుల వద్ద పోలీసులు సీజ్ చేసినవి..
1. పల్సర్ బండి TS07GW0160,
2. VIVO Phone-1
3. One car TS03EV9207
4. అల్ ఇండియా హ్యూమన్ రైట్ లెటర్ పాడ్స్-4,
5. అల్ ఇండియా హ్యూమన్ రైట్ మెంబర్ షిప్ సర్టిఫికెట్స్ -14,
6. ల్యాండ్ కి సంభదించినా కాపీలు-25,
7. తెలంగాణ ప్రభుత్వం డబ్బులు బెడ్ రూమ్ లకు కు సంబందించిన ధ్రువ పత్రాలు-22,
8. అల్ ఇండియా హ్యూమన్ రైట్ మెంబర్ షిప్ కార్డ్స్-6,
9. వివిధ పేర్ల మీద ఉన్న కాళీ స్టాంప్ పేపర్స్-10,
10. వివిధ సెట్టిల్ మెంట్స్ చేసినా స్టాంప్ పేపర్స్-14
11. తెలంగాణ ID కార్డు-1
12. హ్యూమన్ రైట్స్ ID కార్డ్స్-2