By: ABP Desam | Updated at : 09 Dec 2021 04:57 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వసంత్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్
బెజవాడలో చెడ్డీ గ్యాంగ్ చెలరేగిపోతున్నారు. నగర శివారులో వరుస దోపిడీలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. చెడ్డీలు ధరించి, మారణాయుధాలతో దొంగతనాలకు తెగబడుతున్నారు. ఇటీవల సీఎం క్యాంపు ఆఫీసుకు సమీపంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అపార్ట్ మెంట్ లలో చోరీ చేశారు. దొంగతనం సమయంలో ఎవరైనా ప్రతిఘటిస్తే వారిని హతమార్చడం, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడడం చేస్తున్నారు చెడ్డీ గ్యాంగ్. వినడానికి వణుకు పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్ ఇటీవల హైదరాబాద్‌లో దడ పుట్టించారు. ఇప్పుడు ఏపీలో చెడ్డీ గ్యాంగ్ హడలెత్తిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో చెడ్డీ గ్యాంగ్ వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. పది రోజుల వ్యవధిలో చెడ్డీ గ్యాంగ్ ఐదు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. చిట్టి నగర్, గుంటుపల్లి, తాడేపల్లి, కుంచనపల్లి అపార్ట్ మెంట్లలలో దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read:చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ ఎఫైర్.. భర్త వెళ్లగానే ఇంట్లోకి వచ్చేవాడు.. విషయం బయటకు తెలిసి..
పోరంకిలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్
కృష్ణా జిల్లా పోరంకి వసంత్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపుతోంది. నగర శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ వరుస దోపిడీలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ గ్యాంగ్ పై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. విజయవాడ శివారు గ్రామాల్లోని అపార్ట్ మెంట్లలో, శివారు కాలనీల్లో హల్ చల్ చేస్తోన్న చెడ్డీ గ్యాంగ్ ను త్వరలోనే పట్టుకుంటామని సీపీ క్రాంతి రాణా టాటా ప్రకటించిన రోజునే చెడ్డీ గ్యాంగ్ పోరంకి వసంత నగర్ కాలనీలో రెచ్చిపోయారు. పోరంకి వసంత్‌నగర్‌లోని వ్యాపారి సత్యన్నారాయణ ఇంట్లో నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారం, వెండిని చెడ్డీ గ్యాంగ్ చోరీ చేశారు. శివారు అపార్ట్‌మెంట్‌లే లక్ష్యంగా చెడ్డీగ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. పోరంకి వసంత్ నగరలో దొంగతనంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలతో దొంగల కదలికలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయవాడ పోలీసులు తెలిపారు.
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే విల్లాల్లో చోరీ
గుంటూరు, విజయవాడల్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి హై సెక్యూరిటీ జోన్‌లో ఉంటుంది. ఆ ప్రాంతాలోనూ ఇటీవల చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడింది. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన విల్లాల్లో దొంగతనం చేసినట్లుగా తెలుస్తోంది. గత వారం విజయవాడలోని శివదుర్గ ఎన్‌క్లేవ్‌లో దోపిడీ చేశారు. దీంతో పోలీసులు దొంగల్ని పట్టుకోవడానికి వేట ప్రారంభించారు.
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
Palnadu Students Fight : అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !
Chitrakoot Temple: చారిత్రక ఆలయంలో విగ్రహాల చోరీ - పీడకలలు రావడంతో దొంగల ముఠా ఏం చేసిందంటే !
Nalgonda: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య, తిరిగొచ్చేస్తానని మళ్లీ భర్తకు ఫోన్ - ఊహించని షాక్ ఇచ్చిన భర్త
Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య
Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్