అన్వేషించండి

Chittor Crime : కామంతో కళ్లు మూసుకుపోయి వదినపైనే కన్నేశాడు..! చివరికి...

చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి వావి వరుసలు మర్చి వదినపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు పట్టుకుంటారన్న భయంతో గుళ్లో దాక్కున్నాడు. దొంగ తనానికి వచ్చాడని గ్రామస్తులు అతన్ని పోలీసులకు పట్టించారు.


చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మినికి అనే గ్రామంలో ఉన్న గుళ్లో రాత్రి పూట అలికిడి అయిన శబ్దాలు వినిపించడంతో గ్రామస్తులంతా దొంగలు పడినట్లుగా గుర్తించారు.  ఓ దొంగను పట్టుకున్నారు. పోలీసుల్ని పిలిపించి అప్పగించారు. పోలీస్ స్టేషన్‌లో ఆ దొంగ కానిస్టేబుల్ తుపాకీ చివరన ఉండే కత్తిని తీసుకుని గొంతు కోసేసుకున్నాడు. దీంతో కంగారు పడిన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఎక్కడ లాకప్‌డెత్ కేసు తమ మీదకు వస్తుందోనని వారు హైరానా పడిపోయారు. మినికి గుళ్లో ఎలాంటి దొంగతనం జరగలేదు. ఉన్నవి ఉన్నట్లుగానే ఉన్నాయి. అయినా ఆ కేసు కోసం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో పోలీసులకు అర్థం కాలేదు. ఆ దొంగనే ప్రశ్నించినా సస్పెన్స్ వీడలేదు. కానీ ఆ దొంగలో పోలీసులు ప్రశ్నించిన తర్వాత కాస్తంత ప్రశాంతత ఉండటం గమనించారు. అసలు ఆ మిస్టరీ ఏమిటో అర్థం కాలేదు.

Also Read : బాలుడిపై లైంగిక వేధింపులు కేసులో సంచలన తీర్పు... ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష... నాలుగేళ్ల తర్వాత న్యాయం

 అసలు ఆ దొంగ తాను ఆత్మహత్యాయత్నం చేసింది దొంగతనం కేసులో అరెస్ట్ చేశారని కాదు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ వ్యక్తి మినికి అనే ఊళ్లో గుళ్లో దొంగతనానికి రాలేదు. దాక్కోడానికి వచ్చాడు. అదీ కూడా పోలీసుల నుంచితప్పించుకోవడానికే .  కానీ దొంగతనం కేసులో పోలీసులకు చిక్కాడు. ఇక్కడ ట్విస్టేమిటంటే తనను దొంగతనం కేసులో అరెస్ట్ చేశారని అతనికి తెలియదు. తను చేసిన వేరే నేరంలోనే పట్టుకున్నారని.. ఆ కేసు గురించి బయటకు తెలిస్తే పోలీసులు కాదు బంధువులు బతకనీయరన్న ఉద్దేశంతోనే ఆ దొంగ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇంతకీ అతను చేసిన నేరం ఏమిటంటే సొంత వదినపై అత్యాచారయత్నానికి పాల్పడటం. 

Also Read : డిపాజిట్లు తమ సొంతమేనని స్వాహా ! చిత్తూరు జిల్లాలో బ్యాంక్ సిబ్బంది నిర్వాకం
  
చిత్తూరు జిల్లా, రామసముద్రం మండలం, ప్యాడరాసిపల్లెలో అన్న, వదినల దగ్గర ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ ఉంటాడు గంగిరెడ్డి. కొంత కాలం తిన్నగానే ఉన్న ఇటీవలి కాలంలో వదినను వక్రబుద్దితో చూడటం ప్రారంభించాడు. అప్పుడప్పుడు చేయి తాకడం వంటి అసభ్యకరమైన పనులకు పాల్పడేవాడు. ఇంట్లో చెబితే గొడవలు అవుతాయని.. గంగిరెడ్డి ని అందరూ తప్పుడు వ్యక్తిగా చూస్తారని ఆమె వీలైనంత వరకూ తప్పు చేస్తున్నావని హెచ్చరించేది. అయినా మాట వినలేదు. అతని ఆగడాలు పెరిగిపోతూండటంతో భర్తకు చెప్పింది. అయితే తమ్ముడి విషయాన్ని అన్న సీరియస్‌గ ాతీసుకోలేదు. అన్న ఉన్నప్పుడు బుద్దిమంతుడిలా నటించే గంగిరెడ్డి  వదిన ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వరూపం చూపేవాడు. Also Read : బట్టల దుకాణంలో దొంగతనం కేసు... సస్పెండ్ అయిన ఏఎస్సై గుండె పోటుతో మృతి...

చివరికి మూడు రోజుల కిందట అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి గ్రామానికి వెళ్లారు. కానీ అప్పటికే కేసు పెట్టిన విషయం తెలుసుకున్న గంగిరెడ్డి గ్రామం వదిలి పరారయ్యారు. ఎక్కడ దాక్కున్నా ఎవరో ఒకరు చూసి పోలీసులకు చెబుతారని పక్క గ్రామానికి వెల్లి గుళ్లో దాక్కున్నాడు. గుళ్లో దాక్కున్న గంగిరెడ్డిని చూసిన గ్రామస్తులు దొంగతనం చేయడానికి వచ్చాడని భావించి పోలీసులకు పట్టించారు.. అయితే తన వదిన కేసులో గ్రామస్తులు అంతా తనను పోలీసులకు అప్పగించారని భ్రమ పడిన గంగిరెడ్డి పోలీసు స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం చేశాడు. Also Read : పాపులారిటీ కోసం నడి రోడ్డుపై ట్రాఫిక్ ఆపేసి రచ్చ చేసింది, ఇప్పుడు చిక్కుల్లో పడింది..

చివరికి వదినపై అత్యాచారం కేసులో తాము వెదుకుతున్న గంగిరెడ్డి ఇతనేనని తెలుసుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  గంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడ గానే ఉండడంతో కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమయ్యారు. దారి తప్పి వావి వరుసలు మర్చిపోయిన గంగిరెడ్డి చివరికి కటకటాల పాలయ్యాడు. 

Also Read : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget