Khammam News: పోడు భూముల వివాదం - పోలీసులపై గిరిజనుల దాడి, ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Telangana News: పోడు భూముల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సద్దిచెప్పేందుకు వెళ్లిన పోలీసులపైనే గిరిజనులు కర్రలతో దాడికి తెగబడ్డారు.
Tribals Attacked on Police In Khammam: పోడు భూములకు సంబంధించి ఇరు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గిరిజనులు పోలీసులపైనే దాడి చేసిన ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయాపాలెం అటవీ ప్రాంతంలో ఆదివారం పోడు భూముల విషయం రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సద్దిచెప్పేందుకు యత్నించారు. ఈ క్రమంలో కొందరు గిరిజనులు పోలీసులపైనే దాడికి తెగబడ్డారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారిని వెంటపడి మరీ కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో సత్తుపల్లి సీఐ కిరణ్, నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య అసలు వివాదం ఎందుకు రేగింది.? అనే దానిపై ఆరా తీసేలోపే గిరిజనులు కోపోద్రిక్తులై పోలీసులపైనే దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Kadiyam Srihari Joins Congress: కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య