అన్వేషించండి

Tirupati Traffic Police: తిరుపతిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం - సామాన్యుడ్ని ఎగిరెగిరి కాళ్లతో తన్నుతూ అరాచకం Watch Video

Traffic Constable Beats Old Man: తిరుపతిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం చేశాడు. తనకు ఇష్టం వచ్చినట్లు పదే పదే విచక్షణా రహితంగా కాళ్లతో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు.

Tirupati Traffic Police beats An Old Man: తిరుపతి: తిరుపతిలో ట్రాఫిక్ పోలీస్ కిషోర్ నాయుడు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న ఒక వృద్ధుడిపై తనదైనశైలిలో ప్రతాపం చూపించాడు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నాడన్న కారణంతోనే, మరేదైనా కారణంతోనే తనకు ఇష్టం వచ్చినట్లు పదే పదే విచక్షణా రహితంగా కాళ్లతో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు. శనివారం సాయంత్రం తిరుపతి అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే..
అన్నమయ్య సర్కిల్‌కు సిమెంట్ లోడ్ తో‌  ఓ‌లారీ వచ్చింది. లారీ అక్కడ నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని,‌ లారీని వెంటనే అక్కడ నుంచి పక్కకు తీయాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పాడు. ఏం ఇబ్బంది‌ లేదని లారీలో వచ్చిన ఓ వ్యక్తి పోలీసుతో అన్నాడు. ఒకరినొకరు మాట మాట అనుకుంటూ పరస్పరం తోసేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కాలితో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు. వయసులో పెద్దవాడు అని కూడా చూడకుండా తన కాలికి పని చెప్పడాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు షాకయ్యారు.

ట్రాఫిక్ పోలీస్ వృద్ధునిపై వీరంగం చేసిన వీడియో వైరల్..

ట్రాఫిక్ పోలీస్ ప్రవర్తించిన తీరును ప్రక్కనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఒకవేళ ఆ వ్యక్తి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే అవసరమైతే అందుకు తగ్గట్టు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మరీ అవసరమైతే సమీపంలోని బ్లూ కోర్ట్స్ సిబ్బందిని పిలిచి తాత్కాలికంగా అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అంతే తప్పా ప్రజలపైన నేరుగా అందరూ చూస్తుండగా భౌతికదాడికి దిగడం, అది కూడా అందరూ చూస్తున్నారన్న విచక్షణ మరచి బహిరంగ ప్రదేశంలో వ్యవహరించడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 
ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్..
ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉన్నతాధికారులు ఉపన్యాసాలు ఒకవైపు ఇస్తుంటే మరోవైపు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. వృద్ధుడిని పదే పదే తన్నుతూ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం చేసిన ఈ ఘటనపై తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ స్పందించారు. క్షమశిక్షణ ఉల్లంఘించిన కిషోర్ పై శాఖా పరమైన చర్యలకు సిద్దమన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిషోర్ ను సస్పెండ్ చేసేందుకు పోలీసు శాఖ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. డీజీపీ సార్ ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ స్థానికులు, నెటిజన్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ చర్యపై మండిపడుతున్నారు. అతడ్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Shocking News: నేరేడుపండ్లు తిని బాలుడు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం - అసలేం జరిగింది !

Also Read: Pathyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget